ఏదైనా సరే ఒక్కడితోనే మొదలౌతుంది. అతని మార్గాన్ని వేలాది మంది ఫాలో అవుతుంటారు. కరోనా మహమ్మారి కారణంగా కోట్లాది మంది ఉద్యోగ, ఉపాది అవకాశాలు కోల్పోయారు. ఉద్యోగాలు చేసిన సమయంలో సంపాదించిన మొత్తంతోనే రెండేళ్లుగా ప్రజలు నెట్టుకొస్తున్నారు. ఇప్పుడిప్పుడే కరోనాకేసులు తగ్గతుండటంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, పూర్తిస్థాయిలో రవాణా వ్యవస్థ తెరుచుకోలేదు. కేవలం కొన్ని మాత్రమే నడుస్తున్నాయి. ముఖ్యంగా ముంబై వంటి మహానగరాల్లో సామాన్యులు ప్రయాణం చేసే మెట్రో రైళ్లు తెరుచుకున్నా, ప్రభుత్వ ఉద్యోగులకు, అత్యవసరంగా…
కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి తిరిగి విజృంభిస్తుండటంతో వివిధ దేశాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న దేశాలపై ట్రావెల్ బ్యాన్ ను విధిస్తున్నాయి. తాజాగా గల్ప్ దేశమైన యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సహా 14 దేశాలకు చెందిన ప్రయాణికులపై నిషేదం విధించింది. ఈ నిషేదం జులై 21 వరకు అమలులో ఉండబోతున్నది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకతో పాటుగా ఆఫ్రికాలోని వివిధ దేశాలపై కూడా యూఏఈ నిషేదం విధించింది. కరోనా…
కరోనా మహమ్మారిలో అనేక వేరియంట్‌లు యావత్ దేశాలను అతలాకుతలం చేస్తున్నది. ఆల్ఫా వేరియంట్ అత్యధికంగా 172 దేశాల్లో వ్యాపించగా, దాని తరువాత డెల్టా వేరియంట్ 100కు పైగా దేశాల్లో వ్యాప్తిచెందినట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పష్టంచేసింది. సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియంట్ కారణంగా ఎక్కువ కేసులు, మరణాలు సంభవించాయని, ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఆందోళన కలిగిస్తోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొన్నది. రాబోయో రోజుల్లో ఈ వేరియంట్ మిగతా వేరియంట్‌లను డామినేట్ చేసే అవకాశం…
మన దేశంలో కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతున్నాయి. నిన్న పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ కాస్త తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 46,617 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,58,251 కి చేరింది. ఇందులో 2,95,48,302 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 5,09,637 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24…
కరోనా ప్రభావం అన్నిరంగాలపై పడింది. కరోనాకు ముందు కళకళలాడిన హోటల్ రంగం కోవిడ్ ఎంటర్ కావడంతో కుదేలయింది. నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు వంటి నగరాల్లో కూడా హోటల్ రంగం కుదేలయింది. బెంగళూరు నగరంలో 25 వేలకు పైగా హోటళ్లు ఉండగా 2500 హోటళ్లు అమ్మకానికి ఉన్నట్టు హోటల్ అసోసియోషన్ తెలియజేసింది. కర్ణాటక రాష్ట్రంలో దాదాపుగా 70 వేలకు పైగా రిజిస్ట్రేషన్ హోటళ్లు ఉండగా, అందులో 10వేలకు పైగా హోటళ్లు అమ్మకానికి సిద్దంగా ఉన్నట్టు సమాచారం. కరోనా…
కరోనా మహమ్మారి ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. గత రెండేళ్లుగా కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కేసులు తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతున్నాయి. ప్రపంచంలో మొదటగా కరోనాకు వ్యాక్సిన్ ను తయారు చేసిన రష్యా ఆ దేశంలోని ప్రజలకు ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ ను అందించింది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ దేశంలో మరలా కేసులు పెరుగుతున్నాయి. Read: తెలకపల్లి రవి : చైనా కమ్యూనిస్టు పార్టీ…
దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సిన్ ను వేగంగా అందిస్తున్నారు. జులై నెలలో దేశంలో ఎన్ని డోసులు అందుబాటులో ఉంటాయనే దానిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ నెలలో 12 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని, ప్రైవేట్ వ్యాక్సిన్లు దానికి అదనం అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు. ఏ రాష్ట్రానికి ఎన్నెన్ని డోసులు అందిస్తున్నామో ఖచ్చితమైన లెక్కలు ఉన్నాయని అన్నారు. అయినప్పటికి కొంతమంది నేతలు కావాలని వ్యాక్సిన్ కొరత ఉందని…
ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ప్రతి ఒక్కరికి వారి జీవితంపై ఎన్నో కలలు ఉంటాయి. ఆ కలను నెరవేర్చుకోవడానికి అహర్నిశలు కష్టపడుతుంటారు. అయితే, కరోనా మహమ్మారి ఆ కలలపై నీళ్లు చల్లింది. కష్టపడి సాధించుకున్న ఉద్యోగాలు పోయి కోట్లాదిమందిని రోడ్డున పడేసింది ఈ మహమ్మారి. కొంతమంది జీవితంలో ఏదేతే సాధించాలని అనుకున్నారో, అది సాధించి ఆ ఫలాలు చేతికి అందే సమయానికి కరోనా మహమ్మారికి బలైపోతున్నారు. బీహార్‌కు చెందిన అవినాశ్ అనే వ్యక్తికి చిన్నప్పటి…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గుతుంది. తాజాగా రాష్ట్రంలో 3,841 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,93,354 కి చేరింది. ఇందులో 18,42,432 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 38,178 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 38 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 12,744 కి చేరింది. ఇకపోతే గడిచిన…
డాక్టర్స్ డే సందర్బంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరనా సమయంలో వైద్యులు చేసిన సేవలను కొనియాడారు. వైద్యసదుపాయాలను మెరుగుపరిచామని ప్రధాని మోడి పేర్కొన్నారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తూ అనేక మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలో వైద్యులు ముందు వరసలో ఉన్నారి, వారి ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాదిమంది ప్రజల ప్రాణాలు కాపాడారని ప్రధాని పేర్కొన్నారు. వైద్యరంగం కోసం రూ.2 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్టు ప్రధాని…