కరోనా మహమ్మారిలో అనేక వేరియంట్‌లు యావత్ దేశాలను అతలాకుతలం చేస్తున్నది. ఆల్ఫా వేరియంట్ అత్యధికంగా 172 దేశాల్లో వ్యాపించగా, దాని తరువాత డెల్టా వేరియంట్ 100కు పైగా దేశాల్లో వ్యాప్తిచెందినట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పష్టంచేసింది. సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియంట్ కారణంగా ఎక్కువ కేసులు, మరణాలు సంభవించాయని, ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఆందోళన కలిగిస్తోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొన్నది. రాబోయో రోజుల్లో ఈ వేరియంట్ మిగతా వేరియంట్‌లను డామినేట్ చేసే అవకాశం ఉన్నట్టు WHO తెలియజేసింది. దేశాలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని, వ్యాక్సిన్‌ను వేగంగా అమలు చేయాలని WHO తెలిపింది.