ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజువారీ కేసులు భారీ స్థాయిలో తగ్గుతుండటం విశేషం. చాలా రోజుల తరువాత నలభైవేలకు దిగువున పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 37,566 కేసులు నమోదయ్యాయి. Read: ‘ఒకే ఒక జీవితం’ అంటున్న శర్వానంద్! దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,16,897కి చేరింది. ఇందులో 2,93,66,601 మంది కోలుకొని…
కరోనా థర్డ్‌వేవ్‌కు అవకాశం ఉందంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించొద్దని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ విజ్ఞప్తి చేశారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం, భయపడకుండా ఉండటమే దీనికి మంత్రంగా పనిచేస్తుందని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటించడమే థర్డ్‌వేవ్ ముప్పు నుంచి రక్షణ పొంగలగమన్నారు. వైద్యులకు నాదో చిన్న విన్నపం. థర్డ్‌వేవ్‌పై భయాందోళనలు సృష్టించవద్దు. ఎందుకంటే దీనికి ప్రాథమిక సూత్రం ముందు జాగ్రత్తే గాని భయాందోళనకు గురికావడం కాదు” అని సూచించారు. థర్డ్‌వేవ్ గురించి మాట్లాడేందుకు బదులుగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సెకండ్ వేవ్‌పై…
ఫేక్ న్యూస్‌పై సీరియస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… కోవిడ్‌పై సమీక్ష సందర్భంగా పత్రికా కథనాలను ప్రస్తావిస్తూ.. తప్పుడు కథనాలపై తీవ్రంగా స్పందించారు సీఎం.. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంతో రాష్ట్రానికి మంచిపేరు వచ్చిందనే తప్పుడు వార్తలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు.. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడమే వీటివెనుక ఉద్దేశమని విమర్శించిన సీఎం… అందుబాటులో 70 శాతానికి పైగా ఆక్సిజన్ బెడ్లు, 70 శాతానికిపైగా వెంటిలేటర్లు ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరతతో రోగులు చనిపోతున్నారని ఎలా రాయగలుగుతున్నారు?…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 71,758 సాంపిల్స్ పరీక్షించగా… 2,224 మందికి పాజిటివ్‌గా తేలింది.. మహమ్మారితో మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.. చిత్తూరులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, తూర్పు గోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున, అనంతపూర్, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ఇక, విశాఖ, విజయనగరం జిల్లాలో…
కరోనా మహమ్మారి అడవుల్లో అన్నలను కూడా తాకింది.. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు కరోనా బారినపడ్డారు.. వారు జనజీవన స్రవంతిలో కలిసిపోతే వారికి సరైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు ప్రకటనలు చేస్తున్నారు.. అయితే, పోలీసుల ప్రకటను తీవ్రంగా ఖండిస్తున్నారు మావోయిస్టులు.. ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ లేఖ విడుదల చేశారు.. కామ్రేడ్ శారద, ఇడ్మా ఆరోగ్యంగానే ఉన్నారని. పాలకులు, ప్రభుత్వాలు కావాలనే దుష్పాచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.. వాటిని నమ్మి కుటుంబ…
ఏపీలోని 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలించారు. కోవిడ్ పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ ఉన్న 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలించారు. రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేయడానికి సమయం ఇచ్చారు. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే సడలించారు. ఈ జిల్లాల్లో సాయంత్రం…
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా డెల్టాప్లప్ వేరియంట్ నుంచి ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు డెల్టా వేరియంట్ ప్రధాన కారణం అయింది. ఈ వేరియంట్ కారణంగానే కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇకపోతే, ఇప్పుడు దేశాన్ని డెల్టాప్లస్ వేరియంట్ భయపెడుతున్నది. ఇప్పటికైతే ఈ వేరియంట్ కేసులు తక్కువగా నమోదైతున్నప్పటికీ, రాబోయో రోజుల్లో ఈ వేరియంట్ నుంచి థర్డ్ వేవ్ ముప్పు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read:…