డాక్టర్స్ డే సందర్బంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరనా సమయంలో వైద్యులు చేసిన సేవలను కొనియాడారు. వైద్యసదుపాయాలను మెరుగుపరిచామని ప్రధాని మోడి పేర్కొన్నారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తూ అనేక మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలో వైద్యులు ముందు వరసలో ఉన్నారి, వారి ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాదిమంది ప్రజల ప్రాణాలు కాపాడారని ప్రధాని పేర్కొన్నారు. వైద్యరంగం కోసం రూ.2 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్టు ప్రధాని తెలిపారు.
Read: అసిస్టెంట్ డైరెక్టర్ కి పడిపోయిన అందాల రాశి!
ఈ ఏడాది మార్చి నుంచి దేశంలో కరోనా మహమ్మారి విరుచుకుపడింది. ఫిబ్రవరి వరకు కరోనా కేసులు పెద్దగా లేకున్నా, మార్చినుంచి ఒక్కసారిగా పెరిగాయి. అసుపత్రుల కొరత, అత్యవసర విభాగాల కొరత తీవ్రంగా కనిపించింది. అంతేకాదు, దేశంలో ఏప్రిల్, మే నెలలో ఆక్సీజన్ కొరత కారణంగా అనేక మంది కరోనా రోగులు మృతిచెందారు. దీంతో దేశంలో ఆక్సీజన్, ఆసుపత్రుల్లో అత్యవసర విభాగాలను ప్రభుత్వాలు వేగంగా ఏర్పాటు చేయడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చిందని చెప్పొచ్చు. వేగంగా వ్యాక్సిన్ ప్రక్రియను అమలు చేస్తున్నారు.