కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా, ఆంక్షలను సడలించడంతో నిబంధనలను పక్కన పెట్టేశారు. నిబంధనలను గాలికి వదిలేసి మాస్క్ లేకుండా తిరుగుతున్నారు. మొదటి వేవ్ తరువాత నిబంధనలు పాటించకుండా ఉండటంతో సెకండ్ వేవ్‌కు దారితీసింది. సెకండ్ వేవ్‌లో పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. భారీస్థాయిలో మరణాలు సంభవించాయి. అయినప్పటికీ నిబంధనలు పాటించకపోతుండటంతో మూడో వేవ్ అనుకున్న దానికంటే ముందుగానే వచ్చే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆర్ వ్యాల్యూ పెరుగుతున్నదని, ఆర్ వ్యాల్యూ పెరిగితే ముప్పు అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read: ఇద్దరు సీఎంల మధ్య రహస్య ఒప్పందం ఉంది : విష్ణువర్ధన్ రెడ్డి
కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ఆర్ వ్యాల్యూగా పేర్కొంటారు. మే 15 వరకు ఆర్ వ్యాల్యూ 0.78 గా ఉండేది. అంటే కరోనా ఒకరి నుంచి 78 మందికి సోకుతుందని అర్ధం. జూన్ చివరి వరకు ఈ వ్యాల్యూ క్రమంగా తగ్గుతూ వచ్చింది. దీంతో ఆంక్షలను సడలిస్తూ వచ్చారు. అయితే, జూన్ 26 వ తేదీ నుంచి ఈ వ్యాల్యూ మళ్లీ పెరుగుతూ వస్తున్నది. జూన్ 26న ఈ వ్యాల్యూ 0.88గా ఉన్నట్టు చెన్నైలోని మ్యాథమేటికల్ సైన్సెస్ తెలియజేసింది. ఈ ఆర్ వ్యాల్యూ 1కంటే పెరిగితే డెంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కేరళలో ఆర్ వ్యాల్యూ 1.1గా, మహారాష్ట్రలో 1గా ఉన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. సరైన నిబంధనలు పాటిస్తే కరోనాను అరికట్ట వచ్చని నిపుణులు చెబుతున్నారు.