Sadhvi Pragya: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. సోషల్ మీడియా వేదిక ఎక్స్(ట్విట్టర్)లో ఆమె కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ విమర్శించారు.
రెజ్లింగ్ అసోసియేషన్‌లో మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసుపై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. విచారణ సమయంలో హాజరు కానందుకు బాధితురాలు సాక్షికి కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 14 లోగా కోర్టులో సాక్ష్యాలను దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో గతంలో కూడా బాధితురాలికి సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె దేశంలో లేరని, అందుకే ఇక్కడికి రాలేనని బాధితురాలి తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. వచ్చే నెలలో జరిగే ఛాంపియన్‌షిప్‌కు…
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో లాయర్లపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో పలువురు న్యాయవాదులు గాయపడ్డారు. బార్ అసోసియేషన్ అధికారికి సంబంధించిన కేసులో కొందరు న్యాయవాదులు జిల్లా జడ్జిని ఆశ్రయించినట్లు సమాచారం. విచారణ సందర్భంగా న్యాయవాదులు జిల్లా జడ్జితో దురుసుగా ప్రవర్తించారు. అనంతరం జిల్లా న్యాయమూర్తులు కోర్టు ఆవరణలోనే పోలీసులను పిలిచారు.
Divorce Case: తాజాగా చైనా దేశంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. 20 సంవత్సరాల పాటు సజావుగా కొనసాగుతున్న వివాహ బంధాన్ని విడదయడానికి అంగీకరించని భర్త కోర్టులోనే ఓ విచిత్ర సంఘటనకు పాల్పడ్డాడు. విడాకులకు సంబంధించి జడ్జిమెంట్ జరుగుతున్న సమయంలో వ్యక్తి తన భార్యను భుజాలపై ఎత్తుకొని కోర్టు నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. చట్టపరమైన విచారణ జరుగుతున్న సమయంలో జరిగిన ఈ సంఘటన జరగడంతో ఈ విషయం కాస్త ప్రపంచ…
Kolkata Doctor Case: ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ సంచనల వ్యాఖ్యలు చేసింది. తాలా పోలీస్ స్టేషన్‌లో తప్పుడు రికార్డులు సృష్టించారని ఆరోపించింది.
వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తాను 12 సార్లు సివిల్స్ పరీక్షలు రాశానని.. అయితే వాటిలో కేవలం ఐదింటిని మాత్రం పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆమె కోరారు. ఐఏఎస్ ఉద్యోగాన్ని సంపాదించడానికి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో యూపీఎస్సీ ఆమెపై చర్యలు తీసుకుంది.
Priyadarshi and Nani New Movie: ‘నేచురల్ స్టార్’ నాని ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగా కూడా మూవీస్ తెరకెక్కిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ ‘వాల్ పోస్టర్ సినిమా’పై ఇప్పటికే కొన్ని చిత్రాలు రాగా.. నేడు మరో సినిమాను ప్రకటించారు. ఇటీవల ‘డార్లింగ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రియదర్శిని హీరోగా పెట్టి తన నిర్మాణ సంస్థలో ఓ సినిమా తీస్తున్నా అని ప్రకటించిన నాని.. నేడు ఆ చిత్రంను అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు…
ఇటీవల నాగ్‌పూర్ జిల్లా కోర్టులో న్యాయమూర్తి చేసిన పని చర్చనీయాంశమైంది. జడ్జి ఎస్‌బి పవార్ కోర్టులో ఒక కేసు చర్చిస్తుండగా.. అదే సమయంలో 65 ఏళ్ల సీనియర్ న్యాయవాది తలత్ ఇక్బాల్ ఖురేషీ తన కేసులో న్యాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలోనే న్యాయవాది ఖురేషీ ఉన్నట్టుండి కింద పడిపోయాడు. అది చూసిన జడ్జి పవార్.. ఒక్కసారిగా తన కుర్చీలోంచి లేచి వెంటనే అతని దగ్గరకు వచ్చారు. అంతేకాకుండా.. జడ్జి పవార్ వెంటనే న్యాయవాదికి సీపీఆర్ (CPR) చేశారు.…
2022లో గిర్ సోమనాథ్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో 32 ఏళ్ల వ్యక్తికి గుజరాత్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడికి చనిపోయే వరకు ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌ఐ భోరానియా తీర్పు చెప్పారు. దీంతో పాటు నిందితుడికి రూ.25 వేల జరిమానా కూడా విధించారు