Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వంశీని మరోసారి విచారణ చేసేందుకు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసింది
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. రైల్వే కోడూరు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన ఓబులవారిపల్లె పోలీసులు.. పోసానిని సమగ్ర విచారణ చేయాల్సి ఉందని పిటిషన్ లో వెల్లడి.
Vallabhaneni Vamsi: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంశీ కిడ్నాప్ చేశాడని పోలీసులు కేసు నమోదు చేసిన సత్యవర్ధన్ 164 స్టేట్ మెంట్ ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
Vallabhaneni Vamsi: గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు మూడు రోజుల పాటు విచారించిన తర్వాత కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ ముందు వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. జైలులోనిసెల్ లో తనను ఒంటరిగా ఉంచారని న్యాయమూర్తికి తెలిపారు.
Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంశీ కిడ్నాప్ చేసి దాడి చేశాడని చెబుతున్న సత్యవర్ధన్ స్టేట్ మెంట్ రికార్డు చేయటం కోసం కోర్టులో బెజవాడ పోలీసులు పిటిషన్ దాఖలు వేశారు. సత్య వర్ధన్ నుంచి 164 స్టేట్ మెంట్ రికార్డు చేయటం కోసం సమయం ఇవ్వాలని న్యాయమూర్తిని పోలీసులు పిటిషన్ లో కోరారు.
ప్రైవేట్ జూనియర్ కాలేజీలకి కోర్టులో ఊరట దక్కలేదు. అటు ఇంటర్ బోర్డు కూడా వెనక్కి తగ్గడం లేదు. మిక్స్డ్ అక్యుపెన్సీ భవనాల్లో నడుస్తున్న కళాశాలలకు అనుబంధ గుర్తింపు కోసం బోర్డు లక్ష రూపాయలు ఫైన్ వేసింది. దీంతో కొన్ని కాలేజి యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. రేపే ఇంటర్ ఫీజ్ కట్టేందుకు చివరి తేదీ కావడంతో ఈ లక్ష రూపాయలు కట్టేందుకు కళాశాలలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రతి విద్యార్థి వద్ద లేట్ ఫీ రూపంలో 2 వేల 500…
నాంపల్లి కోర్టుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి చేరుకున్నారు. సంధ్య థియోటర్ ఘటనలో నిన్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మళ్లీ కోర్టుకు చేరుకున్న ఐకాన్ స్టార్ రెగ్యులర్ బెయిల్‌కి సంబంధించి ష్యూరిటీలు సమర్పించారు. మేజిస్ర్టేట్ ఎదుట పత్రాలపై సంతకం చేసి.. ష్యూరిటీలు సమర్పించారు. కోర్టు తీర్పు ప్రకారం.. యాభై వేల రూపాయల డిపాజిట్ తో పాటు రెండు పూచీకత్తులను సమర్పించారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తొలిసారి కోర్టు బోనెక్కారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న తొలి ఇజ్రాయెల్ ప్రధానిగా నిలిచారు. అవినీతి విచారణ కేసులో భాగంగా న్యాయస్థానం మెట్లెక్కారు.
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌ను తరలించే సమయంలో పోలీసులు వింతగా వ్యవహరించారు. అతడి అరుపులు వినపడకుండా ఏకధాటిగా హారన్లు మోగిస్తూ ఉన్నారు. దీంతో అతడి అరుపులు వినపడకుండా పోయాయి.