Chittoor Mayor Couple Murder Case: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో A1 నుంచి A5 వరకు ఉన్న ముద్దాయిలపై హత్యా యత్నం నేరం రుజువైందని కోర్టు పేర్కొంది. వారికి అక్టోబర్ 27వ తేదీ వరకు న్యాయస్థాన జ్యూడిషియల్ కస్టడీ విధించింది. అలాగే, A6 నుంచి A23 వరకు ఉన్న ముద్దాయిలపై న్యాయస్థానం కేసును కొట్టివేసింది. వారికి సంబంధించిన బెయిల్ బాండ్ ఆరు నెలల పాటు అమల్లో…
లైంగిక దాడి కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఇంటి పనిమనిషి దాఖలు చేసిన అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు రుజువు కావడంతో 14 నెలల తర్వాత దోషిగా తేలుస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
తమిళనాడులో జరిగిన కస్టోడియల్ డెత్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. దొంగతనం కేసులో ఆలయ గార్డును పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చావబాదారు. పోలీసులు ఇష్టానురీతిగా కొట్టడంతో అజిత్ కుమార్(28) ప్రాణాలు కోల్పోయాడు.
కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరోషాక్ తగిలింది.. ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్న కాకాణికి మరో కేసులో రిమాండ్ విధించింది కోర్టు.. గత ఎన్నికల సమయంలో ముత్తుకూరు మండలం పంటపాలెంలో దొరికిన మద్యం డంపు కేసులో ఆయన నిందితులుగా ఉండగా.. ఈ నేపథ్యంలో ఆయన్ని ఎక్సైజ్ పోలీసులు పీఈ వారెంట్ పై న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.
Jyoti Malhotra: పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేశారనే ఆరోపణలతో సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు ఈరోజు (జూన్ 9న) తొలిసారి కోర్టులో విచారణకు రాబోతుంది.
Priyadarshi : ప్రియదర్శి హీరోగా వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు. తన ప్రతి సినిమాలో కంటెంట్ ఉండేలా చూసుకుంటున్నాడు. ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తూ హీరోగా తనకంటూ గ్యారెంటీ హిట్ అనే బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. హీరోగా చిన్న సినిమాలతో కెరీర్ మొదలు పెట్టినా.. వరుస సక్సెస్ లు అందుకోవడంతో ఆయన మార్కెట్ పెరుగుతుంది. ఇప్పటికే బలగం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. దాని తర్వాత కోర్టు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సారంగపాణి జాతకం…
ఇటీవల విడుదలైన ‘కోర్ట్’ మూవీ ఎంత మంచి హిట్ అందుకుందో మనకు తెలిసిందే.ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందించగా, దాదాపు రూ.57 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించింది. నాని సమర్పించిన ఈ మూవీకి రామ్ జగదీశ్ దర్శకత్వం వహించగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రం ఎప్పుడు…
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. రాజమండ్రిలోని లలితా నగర్ ప్రాంత వాసి దేవబత్తుల నాగమల్లేష్ ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. స్థానిక వీఆర్ఓ ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న మల్లేష్ ని అరెస్ట్ చేసినట్లు రాజమండ్రి మూడవ పట్టణ పోలీసులు తెలిపారు. కోర్టులో ప్రవేశ పెట్టిన మల్లేష్ కు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు.