2022లో గిర్ సోమనాథ్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో 32 ఏళ్ల వ్యక్తికి గుజరాత్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడికి చనిపోయే వరకు ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌ఐ భోరానియా తీర్పు చెప్పారు. దీంతో పాటు నిందితుడికి రూ.25 వేల జరిమానా కూడా విధించారు. నిందితుడు ఈ ఘటనను అత్యంత క్రూరమైన రీతిలో చేశాడని.. అందుకే ఇది అరుదైన కేసుల్లో అరుదైనదని కోర్టు పేర్కొంది. ఈ కేసులో మరణశిక్ష తప్ప మరో మార్గం లేదని తెలిపింది. ఈ సంఘటన గిర్ సోమనాథ్ జిల్లాలోని కోడినార్ తాలూకాలో 2022 జూన్ 22న జరిగింది. కాగా.. ఈ ఘటనపై జిల్లా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని సోమాభాయ్ సోలంకిగా గుర్తించారు.
Read Also: AP Govt: ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్..
నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (IPC), పోక్సోలోని వివిధ సెక్షన్ల కింద మైనర్ బాలికపై అత్యాచారం, హత్య.. ఆమె మృతదేహాన్ని నిర్జన ప్రదేశంలో పడేసినందుకు అభియోగాలు మోపారు. మొత్తం 55 డాక్యుమెంటరీ సాక్ష్యాలను కోర్టు ముందు సమర్పించారు. ఈ కేసు విచారణ సమయంలో బాధితురాలి కుటుంబం, ఇరుగుపొరుగు వారిని పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు పరిశీలించారు. కాగా.. గుజరాత్ బాధితుల పరిహార పథకం 2019 కింద మైనర్ బాలిక కుటుంబానికి రూ.17 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
Read Also: AP CM: సీఎం చంద్రబాబుతో అమెరికాకు చెందిన ఆర్థికవేత్త భేటీ..!