Heart Attack: కోర్టులో వాదిస్తుండగా న్యాయవాదికి గుండెపోటు.. సీపీఆర్ చేసిన దక్కని ప్రాణం
- కోర్టులో వాదిస్తుండగా న్యాయవాదికి గుండెపోటు
- న్యాయవాది ఖురేషీకి సీపీఆర్ చేసిన జడ్జి
- వెంటనే ఆస్పత్రికి తరలించిన కోర్టు బృందం
- అక్కడ చనిపోయినట్లు నిర్ధారించిన వైద్యులు
- నాగ్‌పూర్ జిల్లా కోర్టులో ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల నాగ్‌పూర్ జిల్లా కోర్టులో న్యాయమూర్తి చేసిన పని చర్చనీయాంశమైంది. జడ్జి ఎస్‌బి పవార్ కోర్టులో ఒక కేసు చర్చిస్తుండగా.. అదే సమయంలో 65 ఏళ్ల సీనియర్ న్యాయవాది తలత్ ఇక్బాల్ ఖురేషీ తన కేసులో న్యాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలోనే న్యాయవాది ఖురేషీ ఉన్నట్టుండి కింద పడిపోయాడు. అది చూసిన జడ్జి పవార్.. ఒక్కసారిగా తన కుర్చీలోంచి లేచి వెంటనే అతని దగ్గరకు వచ్చారు. అంతేకాకుండా.. జడ్జి పవార్ వెంటనే న్యాయవాదికి సీపీఆర్ (CPR) చేశారు. అయినప్పటికీ ఖురేషీలో ఏ మాత్రం చలనం లేదు.
Read Also: Jaya Krishna Ghattamaneni : మహేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. తల్లోంచి ఊడిపడినట్టున్నాడుగా!
Also Read
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
- 144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
దీంతో.. మరొక న్యాయవాది నితిన్ దేశ్‌ముఖ్ ను సంప్రదించి వైద్య సహాయం కోసం తరలించాలని జడ్జి చెప్పారు. ఈ క్రమంలో.. వెంటనే న్యాయమూర్తి పవార్, న్యాయవాది దేశ్‌ముఖ్ వెంటనే ఖురేషీని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతను చనిపోయాడు. ఈ ఘటన శనివారం (ఆగస్టు 17) చోటు చేసుకుంది. బార్ & బెంచ్ నివేదిక ప్రకారం.. “మేము న్యాయవాది ఖురేషీని ఆసుపత్రికి తీసుకుపోయిన వెంటనే, అతన్ని ఐసీయూకి తీసుకువెళ్లారు, కానీ అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు” అని దేశ్‌ముఖ్ చెప్పారు. అయితే.. వారు ఆసుపత్రికి చేరుకునే సమయానికి ఖురేషీకి పల్స్ లేదు. అనంతరం.. ఖురేషీ వైద్య రికార్డులను పరిశీలించగా, అతను కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తేలింది.
Read Also: CM Chandrababu: సోమశిల జలాశయాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అధికారులపై ఆగ్రహం
న్యాయవాది దేశ్‌ముఖ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖురేషీ తనకు ఎసిడిటీ వంటి సమస్య ఉందని భావించి కొంతకాలం క్రితం ఎనో తీసుకున్నాడు. అయితే ఈ ప్రమాదం జరగడానికి రెండు రోజుల ముందు.. ఖురేషీకి ఇసిజి చేయించుకోవాలని ఒక వైద్యుడు సూచించాడని తెలిపారు. అయితే ఖురేషీ ఇసిజీ చేయించుకోలేదు. ఈ క్రమంలో శనివారం.. కోర్టులో గుండెపోటుకు గురయ్యాడని.. దాని కారణంగా అతను మరణించాడని దేశ్ ముఖ్ తెలిపారు. సీనియర్ న్యాయవాది ఖురేషీ అకాల మరణం పట్ల నాగ్‌పూర్ న్యాయవాద సంఘం తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?