నకిలీ అంబులెన్స్ కేసులో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ గురువారం బారాబంకి ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో.. ముఖ్తార్ అన్సారీ కోర్టులో ఒక దరఖాస్తు ఇచ్చారు. జైల్లో తనకు స్లో పాయిజన్ ఇస్తున్నారని అన్సారీ ఈ దరఖాస్తులో ఆరోపించారు. ఇది తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. కాగా.. తనకు వైద్యం చేసేందుకు వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని అన్సారీ కోర్టును అభ్యర్థించారు.
దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మొదట పార్టీ నేతలు, ఇప్పుడు పార్టీ కార్యాలయంపైనే దాడి జరిగింది. ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 15లోగా తమ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు కోసం కేటాయించిన స్థలంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల ఖాళీ చేయాలని తెలిపింది.
అమెరికాలోని లాస్ వెగాస్ లో ఇందుకు భిన్నంగా ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. ఓ మహిళ జడ్జి తీర్పు చదివి వినిపిస్తున్న సమయంలో నిందితుడు సహనం కోల్పోయి.. పరుగు పరుగున వచ్చి న్యాయమూర్తి( జడ్జి ) పై దూకి దాడి చేసేందుకు ప్రయత్నించాడు.
కర్ణాటకలో గేదెల దొంగతనానికి పాల్పడిన 78 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 58 ఏళ్ల క్రితం రెండు గేదెలు, ఒక దూడను దొంగిలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 1965లో గణపతి విఠల్ వాగూర్ అతని సహచరులలో మరొకరు దొంగతనం ఆరోపణలపై మొదటిసారిగా అరెస్టయ్యారు. అప్పటికి గణపతి విఠల్ వయసు 20 ఏళ్లు. ఆ సమయంలో ఇద్దరికీ బెయిల్ వచ్చినప్పటికీ.. వాగూర్ పరారీ అయ్యాడు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వికె శశికళ "విఐపి ట్రీట్‌మెంట్" ఇచ్చిన ఆరోపణలపై విచారణకు హాజరుకాకపోవడంతో లోకాయుక్త ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ.. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు.
ఇమ్రాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మే 9న జరిగిన విధ్వంస ఘటనకు సంబంధించి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేసేందుకు పాక్ కోర్టు పోలీసులకు అనుమతి మంజూరు చేసింది.
జైపూర్-ముంబై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో నలుగురిని కాల్చి చంపిన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ తాను వారిని కాల్చిన సమయంలో సృహాలో లేనని పోలీసులకు చెప్పాడు.