హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కు సర్వం సిద్ధమైంది. రేపు జీహెచ్ఎంసీలో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. రేపు జరిగే ఎన్నికకు ఏప్రిల్ 25న కౌంటింగ్ చేసి ఫలితాల ప్రకటిస్తారు.
NDA Corporators: గ్రేటర్ విశాఖ మేయర్ పదవిని గెలిచి సీఎం చంద్రబాబుకి పుట్టినరోజు కానుకగా ఇచ్చామని కూటమి కార్పొరేటర్లు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన డిప్యూటీ మేయర్ పై జరిగే అవిశ్వాస తీర్మానాన్ని కూడా మేమే గెలుచుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు.
మేయర్ ఎన్నికలో చోటు చేసుకున్న పరిణామాలపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తమ పార్టీ బీ ఫాంపై గెలిచి కూటమికి అనుకూలంగా ఓటేసిన కార్పొరేటర్లపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.. వైసీపీ సభ్యులకు విప్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను ఎన్నికల అధికారికి అందజేశారు ఆ పార్టీ నేతలు తైనాల విజయ్ కుమార్, పల్లా దుర్గా రావు.
కరీంనగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం బండి సంజయ్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. "మేయర్ తో కలిసి 20 మంది కార్పొరేటర్లు బీజేపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందు మేయర్ సునీల్ రావు ప్రతిపాదన ఉంచారు.
కడప జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. కడప కార్పొరేషన్‌లో ఏడు మంది కార్పొరేటర్లు పార్టీ మారనున్నట్లు తెలిసింది. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నారు.
Minister KTR: కరీంనగర్ జిల్లాలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. అందులో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవం, శంఖుస్థాపన చేసారాయన. జిల్లా గ్రంథాలయ భవనంలో డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంఖుస్థాపన చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్, కార్పోరేషన్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ ను మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ ప్రారంభించారు. Read Also: Yash 19: గీతూ మోహన్ దాస్ తో యష్ 19..…
ఒకరు అధికారదర్పంతో అస్తి కోసం సొంత బామ్మర్దినే హత్య చేయించారు. మరికొందరు అధికారబలం ఉందని సామాన్యులపై దాడులకు తెగబడ్డారు.స్థానిక మహిళలపై కూడా జులుం ప్రదర్శిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతకొంతకాలంగా పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేటర్లు నాయకుల తీరు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..కబ్జాలు,బెదిరింపులతో రామగుండం కార్పొరేషన్లో కొందరి ప్రజాప్రతినిధుల తీరు స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.. రామగుండం కార్పొరేషన్ నిత్యం సమస్యలకు నిలయంగా మారింది.అక్కడి ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యలపై కంటే దాడులు, బెదిరింపులకే ప్రాధాన్యత ఇవ్వడంతో బిక్కుబిక్కుమంటూ…
అసలే ఎండలతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కరీంనగర్ నగర వాసులకు నీటి కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి. నగరంలోని అనేక డివిజన్ లలో ప్రజలు నీటి అవసరాలు తీర్చుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు.పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ శివారు గ్రామాలు తాగునీటి సమస్యతో సతమతం అవుతున్నాయి. బిల్లులు సకాలంలో చెల్లించడం లేదనే కారణంతో మిషన్ భగీరథ పనులను గుత్తేదారులు నత్తనడకన చేపట్టడంతో జనాలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. శివారు గ్రామాలను నగరపాలక…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి.. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ప్రకటించారు.. నామినేషన్లు వేసిన 18 మందిలో 3 నామినేషన్ల ఉపసంహరణతో ఏకగ్రీవం అయినట్టుగా వివరించారు లోకేష్ కుమార్.. కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, వనం సంగీత యాదవ్ నామినేషన్లు ఉపసంహరించుకున్నారని వెల్లడించిన ఆయన.. దీంతో స్టాండ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం అయినట్టు తెలిపారు.. ఇక, ఏక గ్రీవంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ స్టాండింగ్…