Minister KTR: కరీంనగర్ జిల్లాలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. అందులో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవం, శంఖుస్థాపన చేసారాయన. జిల్లా గ్రంథాలయ భవనంలో డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంఖుస్థాపన చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్, కార్పోరేషన్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ ను మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ ప్రారంభించారు.
Read Also: Yash 19: గీతూ మోహన్ దాస్ తో యష్ 19.. రామాయణ్ కూడా..
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అద్భుతంగా అభివృద్ధి చెందిందని కొనియాడారు. మరోవైపు కార్పొరేటర్లపై ఆయన మండిపడ్డారు. మున్సిపల్ సమావేశాల్లో అధికారులను తిట్టడమే కార్పొరేటర్ లు గొప్పగా భావిస్తున్నారని.. అవన్నీ మీడియాలో రాగానే పోరాటాలు చేసే నాయకులుగా తయారవుతున్నారని కేటీఆర్ విమర్శించారు. అలా జరుగుతుండటంతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో మీడియాని అనుమతించడం లేదని మంత్రి తెలిపారు.
Read Also: Bhaag Saale: కీరవాణి కొడుకు ఈసారైనా మత్తు వదిలిస్తాడా..?
ఇలాంటి గొడవలు, విమర్శలు చేసుకుంటున్న కారణంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు మీడియా అవసరం లేదని తానే అధికారులకు చెప్పినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కావాలంటే కౌన్సిల్ సమావేశం తరువాత మీడియాకి బ్రీఫ్ చేయమని అన్నట్లు కేటీఆర్ తెలిపారు. అయితే అధికారులు కూడా ప్రజల కోసమే పని చేస్తున్నారని.. వారిని తిట్టడం సరికాదన్నారు. స్వపక్షంలో ఉండే కొందరు కార్పొరేటర్ లు కూడా మేయర్ తో పడకపోతే ఇలా గొడవ పడుతున్నారని.. ఇలా చేయడం సరైన పద్ధతి కాదన్నారు మంత్రి కేటీఆర్.