కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు వదిలారు.. ఇక, సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్యే కాదు.. మృతుల సంఖ్య కూడా భారీగా నమోదు అయ్యింది.. ప్రముఖులు, ప్రజాప్రతినిధులతో పాటు.. కొందరు రాజకీయ పార్టీల నేతలను కూడా కరోనా ప్రాణాలు తీసింది.. ఇవాళ టీఆర్‌ఎస్ నేత, కార్మిక సంఘాల నేత, మహబూబాబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ మాడ్గుల నట్వర్… ఇవాళ ఉదయం మరణించారు.. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…
వ్యాక్సిన్ల విషయంలో క్రమంగా రాష్ట్రాలను కదులుతున్నాయి… కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా లాంటి రాష్ట్రాలు ఇప్పటికే వ్యాక్సిన్‌పై కేంద్రాన్ని డిమాండ్ చేయగా.. తాజాగా, ఈ పోరాటంలో చేరారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసిన ఏపీ సీఎం.. వ్యాక్సిన్‌లకు గ్లోబల్ టెండర్లు వ్యవహారాన్ని లేఖల్లో పేర్కొన్నారు.. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ లభ్యత విషయంలో ఉన్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలందరూ సింగిల్ వాయిస్ మీద ఉండాలని కోరారు వైఎస్…
తెలంగాణలో కోవిడ్ రోజువారి పాజిటివ్ కేసులు క్రమంగా దిగివస్తున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 2,261 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 18 మంది కరోనాతో మృతిచెందారు.. ఇదే సమయంలో.. 3,043 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు వెల్లడించారు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు.. తాజా లెక్కలతో రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గిపోయిందని.. రికవరీ రేటు…
కరోనా మహమ్మారి కారణంగా మరోసారి హజ్ యాత్ర రద్దు చేశారు.. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో.. గత ఏడాది హజ్‌యాత్రను రద్దు చేసిన ఇండోనేషియా.. ఇప్పుడు సెకండ్ వేవ్ నేపథ్యంలో.. వరుసగా రెండో ఏడాది కూడా రద్దు చేసింది. కోవిడ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కూడా హజ్ యాత్రకు ప్రభుత్వం అనుమతించడం లేదని మంత్రి యాకుత్ చోలిల్ కౌమాస్ వెల్లడించారు.. సౌదీ అరేబియా సైతం హజ్‌కు…
కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది మృత్యువాత పడ్డారు. మరణించిన వ్యక్తులకు సంబందించిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పిల్లలు అనాథలుగా మారుతున్నారు. దీంతో వారిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు అనేక రకాల పథకాలు రూపోందిస్తున్నాయి. టాటా సంస్థ తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కరోనాతో మరణిస్తే వారి కుటుంబానికి ఈ వ్యక్తి రిటైర్ అయ్యే వరకూ జీతం అందిస్తామని పేర్కొంది. దీంతో పాటుగా కుటుంబలోని పిల్లల చదువుకు సంబందించిన బాధ్యతను కూడా తీసుకుంటామని తెలిపింది. ఈ బాటలో ఇప్పుడు…
ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. మళ్లీ మందు పంపిణీ ఏర్పాట్లలో మునిగిపోయారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. అయితే, మందు కోసం ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ కృష్ణపట్నానికి రావొద్దు అని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు… జిల్లాకు 5 వేల చొప్పున మందులు పంపుతామని.. అధికారులు వాటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. మరి ఆనందయ్య మందు పంపిణీ ఎప్పటి నుంచి అని అంతా ఎదురుచూస్తోన్న సమయంలో.. సోమవారం నుండి అందుబాటులోకి…
కరోనా సమయంలో వైద్యులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని నిర్ణయం తీసుకుంది.. మీడియాతో మాట్లాడిన ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్.. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని నిర్ణయం తీసుకున్నాం.. రూ. 45 వేల నుంచి రూ. 70 వేలకు పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు.. ఇక, జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం పరిశీలిస్తోందని, చర్చిస్తోందన్నారు.. ప్రస్తుతం సుమారు 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు…
ప్రైవేటు హాస్పిటల్స్ పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసాం అని టీఎస్ హైకోర్టుకు డిహెచ్ తెలిపారు. మొదటి దశ కరోనా సమయంలో ప్రయివేటు హాస్పిటల్స్ నుండి పేషేంట్స్ కు 3 కోట్లు రీ ఫండ్ ఇప్పించాము. ఈ సారి కూడా ప్రయివేటు హాస్పిటల్ లో వసూలు చేసిన వారికి రీ ఫండ్ ఇప్పిస్తాము. నిన్న ఒక హాస్పిటల్ 17 లక్షలు బిల్ వేసింది. మేము చర్యలు తీసుకుని మాట్లాడితే 10 లక్షలు పేషంట్ వారికి రిటర్న్ చేశారు…
దేశ రాజధానిలో ఢిల్లీలో కరోనా వైరస్ రోజువారి పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినా.. మృతుల సంఖ్య మాత్రం ఇంకా బయపెడుతూనే ఉంది.. ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటలలో 576 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒకేరోజు మరో 103 మంది మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 1,287 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకోవడం ఊరటనిచ్చే అంశమే.. దీంతో. ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్…
లాక్డౌన్ వేళ న్యాయవాదులను అడ్డుకోవద్దని టీఎస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాదులు, వారి క్లర్కులు స్టెనోలను అనుమతించాలని… బార్ కౌన్సిల్ గుర్తింపు కార్డు చూపిస్తే న్యాయవాదులను అనుమతించాలని హైకోర్టు తెలిపింది. ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి న్యాయవాదుల రాకపోకలు అడ్డుకోవద్దు. న్యాయవాదులు, క్లర్కులు కోర్టు ఆదేశాలను దుర్వినియోగం చేయొద్దు. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం, డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐడీ కార్డు చూపినా న్యాయవాదులను అవమానిస్తే తీవ్రంగా పరిగానిస్తామని హైకోర్టు…