వైద్యులకు గుడ్న్యూస్ చెప్పిన సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సమయంలో వైద్యులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని నిర్ణయం తీసుకుంది.. మీడియాతో మాట్లాడిన ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్.. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని నిర్ణయం తీసుకున్నాం.. రూ. 45 వేల నుంచి రూ. 70 వేలకు పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు.. ఇక, జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం పరిశీలిస్తోందని, చర్చిస్తోందన్నారు.. ప్రస్తుతం సుమారు 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు కరోనా విధుల్లో ఉన్నట్టు ఆయన వెల్లడించారు.
మరోవైపు.. తాజా కరోనా కేసుల లెక్కల ప్రకారం ఏపీలో పాజిటివిటీ రేట్ 13.02 శాతంగా ఉంది.. గడచిన 24 గంటల్లో 443 టన్నుల మేర ఆక్సిజన్ వినియోగించారు.. 25 లక్షల మందికి పైగా రెండు డోసులు పూర్తైనట్టు అనీల్ కుమార్ సింఘాల్ తెలిపారు.. 50 లక్షల మందికి పైగా మొదటి డోస్ వేయడం పూర్తైందన్న ఆయన.. విదేశాలకు వెళ్లే ఉద్యోగులు.. విద్యార్ధులకు వ్యాక్సినేషన్లో ప్రయార్టీ ఉంటుందన్నారు.. విదేశాలకు వెళ్లే వాళ్లు పాస్ పోర్టు నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.. గతంలో ఆధార్ నెంబరుతోనే కోవిన్ పోర్టల్లో రిజిస్టరయ్యేది.. పాస్ పోర్టు నెంబరును కూడా కోవిన్ పోర్టల్లో పెట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు అనీల్ కుమార్ సింఘాల్.
Also Read
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్చార్జ్లతో వన్ టు వన్ భేటీలు
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- OTR: శ్రీకాకుళం మేయర్ సీటు కోసం గుండ లక్ష్మీదేవి ప్రయత్నాలు
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి