కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ వంటి మహమ్మారులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గాడితప్పింది. వ్యాక్సిన్ కనుగొన్న తరువాత కేసులు తగ్గడం ప్రారంభించడంతో అన్ని రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రపంచదేశాలు నడుంబిగించాయి. వచ్చే ఏడాది వరకు ఆర్ధిక రంగం తిరిగి పుంజుకుంటుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 100 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని బ్రిటీష్ కన్సల్టెన్సీ సంస్థ సెబ్ఆర్ వెల్లడించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను చైనా 2028 లో దాటిపోతుందని అనుకున్నా, 2030 వరకు దానికోసం ఆగాల్సిందేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Read: 2021లో ఎక్కువమందిని ఆకర్షించిన వెబ్‌సైట్స్ ఇవే…
వచ్చే ఏడాది ఇండియా ఆర్థిక వ్యవస్థ ఫ్రాన్స్, బ్రిటన్ లను దాటి ఆరోస్థానానికి చేరుతుందని, 2033 వరకు జర్మనీ, జపాన్ ఆర్థిక వ్యవస్థను దాటి మూడో స్థానంలో నిలుస్తుందని బ్రిటన్ కన్సల్టెన్సీ సంస్థ పేర్కొన్నది. అయితే ప్రపంచం ముందు ద్రవ్యోల్బణం రూపంలో అతిపెద్ద సవాల్ ఉందని, దానిని నియంత్రించకపోతే 2024 తరువాత ప్రపంచం మొత్తం మరోసారి ఆర్థికమాంద్యం ఎదుర్కొనక తప్పదని కన్సల్టెన్సీ సంస్థ అంచనా వేసింది.