తెలంగాణలో కరోనా పాజిటివిటి రేటు క్రమంగా పెరుగుతున్నది. వారం రోజుల వ్యవధిలో 0.5 శాతంగా ఉన్న పాజిటివిటి రేటు ఇప్పుడు 1 శాతానికి పెరిగింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. డిసెంబర్ 26 వ తేదీన రాష్ట్రంలో 109 కరోనా కేలసులు ఉండగా ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ 2022, జనవరి 1 వ తేదీకి 317కి చేరింది. రాబోయే రోజుల్లో కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు వైద్యనిపుణులు చెబుతున్నారు. వచ్చే నాలుగు వారాలు చాలా కీలకమని, జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. వైద్యనిపుణుల హెచ్చరికలతో ఇప్పటికే రాష్ట్రంలో ఆంక్షలను అమలు చేస్తున్నారు. జనవరి 10వ తేదీ వరకు బహిరంగ సభలు, ర్యాలీలు, మతపరమైన సభలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
Read: ఒమిక్రాన్ టెన్షన్: హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం…
అంతేకాదు, మాస్క్ లు తప్పని సరి చేసింది ప్రభుత్వం. మాస్క్ ధరించకుంటే రూ. 1000 జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఒమిక్రాన్ ప్రభావం కారణంగా కేసులు పెరుగుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్హులైన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని, చిన్నారులకు సంబంధించి జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయని ప్రభుత్వం తెలియజేసింది. జవవరి 3 నుంచి 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్ వేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 10 నుంచి 60 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసులు వేయనున్నారు.