2020 లో కరోనా మహమ్మారి ప్రపంచంలో వ్యాపించడం మొదలుపెట్టింది. చైనాలో 2019 డిసెంబర్‌లో బయటపడ్డ కరోనా, ఆ తరువాత ప్రపంచ దేశాలకు విస్తరించింది. చైనా నుంచి ఇటలీ, యూరప్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా దేశాలకు వ్యాపించింది. దాదాపుగా అన్ని దేశాల్లోనూ కరోనా మహమ్మారి తన విశ్వరూపం చూపించింది. 2021 వరకు ప్రపంచం వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో కరోనా పూర్తిగా సమసిపోతుందని అనుకున్నారు. కానీ, రూటు మార్చి, రూపం మార్చుకొని డెల్టా రూపంలో, ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో విరుచుకుపడుతున్నది.
Read: ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ సాయం: 5 లక్షల వ్యాక్సిన్ డోసులు పంపిణి…
దీనిపై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశాల మధ్య అసమానతలను పక్కనపెట్టి కలిసికట్టుగా మహమ్మారిని ఎదుర్కొంటే 2022 లో కరోనాను అంతం చేయవచ్చని అన్నారు. కరోనాను అంతం చేయడానికి నూతన వైద్యసాధనాలు ఉన్నాయని, ప్రపంచంలో ఏ దేశం ఇప్పటి వరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకోలేదని డబ్ల్యూహెచ్ఓ తెలియజేసంది. కలిసికట్టుగా పోరాటం చేయకుండా, అసమానతలను పెంచుకుంటూ వెళ్తే ఫలితాలు దారుణంగా ఉంటాయని, వైరస్ మరింత బలంగా మారి ఊహించలేనంత నష్టాలను కలిగించే అవకాశం ఉంటుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ డెరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ పేర్కొన్నారు. దీర్ఘకాలంగా వేదిస్తున్న పోలీయో నుంచే ప్రపంచం ఇంకా పూర్తిగా బయటపడలేదని, ప్రపంచం మొత్తం రాబోయే రోజుల్లో ఎదుర్కొనే సమస్య కరోనానే అని అయన అన్నారు.