ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కారణంగా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 20,181 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఏడుగురు మృతి చెందారు. ప్రస్తుతం ఢిల్లీలో 48,178 కేసులు యాక్టీవ్‌గా ఉండగా, 24 గంటల్లో 11,869 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీలో ఇప్పటి వరకు మొత్తం 25,143 మంది కరోనాతో మృతిచెందారు. ఇక ఇదిలా ఉంటే, ఢిల్లీలో పాజిటివిటీ రేటు 19.6 శాతంగా ఉన్నట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.…
కరోనా తన ప్రతాపం చూపుతోంది. మళ్ళీ ఎవరినీ వదలడం లేదు. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్ లో కరోనా థర్డ్ వేవ్ దడ పుట్టిస్తోంది. ఒకే రోజు ఇద్దరు వైద్యులతో సహా 12 మంది ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఒమిక్రాన్ అనుమానంతో వీరి నమూనాలను ల్యాబ్ కు పంపారు. శ్రీహరి కోటలోని షార్ లో కరోనా మూడో వేవ్ మొదలైంది. కొత్త సంవత్సర వేడుకల కోసం పలువురు ఉద్యోగులు, సొంతూళ్ళకు వెళ్లి…
యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వ తేదీ వరకు ఎన్నికలు జగరబోతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు సంబంధించిన షెడ్యూల్‌ను ఈరోజు సీఈసీ ప్రకటించింది. జనవరి 14 వ తేదీన ఐదు రాష్ట్రాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రిలీజ్ చేయబోతున్నారు. షెడ్యూల్‌ను విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జనవరి 14 వరకు ఎలాంటి పాదయాత్రలు, ర్యాలీలు చేసేందుకు వీలు లేదని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది. అదే…
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘వాక్సినేషన్ చేయించుకున్నప్పటికీ నాకు కరోనా వచ్చింది. దానికి సంబంధించిన తేలికపాటి లక్షణాలు నాకు ఉన్నాయి’ అని ‘పేజీ 3’ డైరెక్టర్ మధుర్ భండార్కర్ తెలిపారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారు కొవిడ్ టేస్టు చేయించుకోవాలని, అలానే కొవిడ్ 19 ప్రోటోకాల్ ను పాటించాలని మధుర్ కోరాడు. ఇదిలా ఉంటే ‘ఫోర్ మోర్ షార్ట్స్’…
మానవాళికి సవాల్ విసురుతోంది కరోనా మహమ్మారి. కోవిడ్ విరుచుకుపడడంతో తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన వారెందరో. అనాథలందరికీ ప్రభుత్వమే తల్లిదండ్రిగా అన్ని బాధ్యతలు స్వీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అనాథలను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించనుంది. సిగ్నళ్ల వద్ద అనాథలతో భిక్షాటన చేసే వారిని కట్టడి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలకు అండగా సర్కార్ నిలవనుంది. అనాథలకు కేజీ నుంచి…
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా తమిళనాడులో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఆదివారం రోజున సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నారు. కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా, కరోనా కట్టడికి సదరన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. చెన్నై లోకల్ రైళ్లలో ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకోని వారిని రైళ్లలోకి అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేసింది. …
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్వరా భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడ ఉంటె ఆమె అక్కడ ఉంటుంది.. ఆమె ఎక్కడ ఉన్నా వివాదాలను మాత్రం వదలదు. గతంలో ఆమె మోదీ ప్రభుత్వంపై చేసిన విమర్శలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో తెలిసిందే. నిత్యం ఏదో ఒక వివాదంలో నానుతూ ఉంటె అమ్మడు తాజాగా కరోనా బారిన పడింది. ఈ విషాయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ” నాకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ…
దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్వారంటైన్ మార్గదర్శకాలను కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఢిల్లీలో వీకెంట్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు. రోజువారీ కేసులు గత మూడు రోజులుగా లక్షకు పైగా నమోదవుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. ఇకపోతే, దేశంలో మూడో వేవ్ ఎప్పటి వరకు పీక్స్ కు వెళ్తుంది అనే…
చిత్ర పరిశ్రమలో కరోనా విలయతాండవం చేస్తోంది. స్టారలందరు ఒకరి తరవాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఈరోజు హీరోయిన్ వారలక్షిమి శరత్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కరోనా బారిన పడ్డారు అనే విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కోవిడ్ బారిన పడింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు. ” కరోనా నియమాలు పాటిస్తున్నా.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా…