కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా తమిళనాడులో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఆదివారం రోజున సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నారు. కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా, కరోనా కట్టడికి సదరన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. చెన్నై లోకల్ రైళ్లలో ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకోని వారిని రైళ్లలోకి అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేసింది.
Read: ఐఐటీ మద్రాస్ కీలక సర్వే: ఫిబ్రవరి 1 నుంచి 15 మధ్య మూడో వేవ్…
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్టుగా సర్టిఫికెట్ ఉంటేనే లోకల్ రైళ్లలో ఎక్కేందుకు టికెట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సదరన్ రైల్వే తెలియజేసింది. గత కొన్ని రోజులుగా తమిళనాడులో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేయాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని, కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.