ఐఐటీ మద్రాస్ కీలక సర్వే: ఫిబ్రవరి 1 నుంచి 15 మధ్య మూడో వేవ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్వారంటైన్ మార్గదర్శకాలను కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఢిల్లీలో వీకెంట్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు. రోజువారీ కేసులు గత మూడు రోజులుగా లక్షకు పైగా నమోదవుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. ఇకపోతే, దేశంలో మూడో వేవ్ ఎప్పటి వరకు పీక్స్ కు వెళ్తుంది అనే దానిపై ఐఐటీ మద్రాస్ కీలక సర్వేను నిర్వహించింది.
Read: ‘పుష్ప’రాజ్ మాయలో పిల్లలు… అడ్డంగా దొరికేశారే!
Also Read
- Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
- Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
ఈ సర్వే ప్రకారం దేశంలో ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15 మధ్య మూడో వేవ్ పీక్స్‌కు వెళ్తుందని పేర్కొన్నది. దేశంలో డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు ఆర్ వ్యాల్యూ 2.9గా ఉంటే, జనవరి 1 నుంచి జనవరి 6 వరకు ఆర్ వ్యాల్యూ 4 గా నమోదైనట్టు ఐఐటీ మద్రాస్ పేర్కొన్నది. ఆర్ వ్యాల్యూ క్రమంగా పెరుగుతున్నదని, క్వారంటైన్ నిబంధనల, ఆంక్షలను కఠినం చేస్తే వైరస్ స్ప్రెడ్ కావడం తగ్గుతుందని, ఫలితంగా ఆర్ వ్యాల్యూ తగ్గుతుందని ఐఐటి ప్రొఫెసర్ జయంత్ ఝా తెలిపారు. సెకండ్ వేవ్ సమయంలో కరోనా కేసులు పీక్స్‌కు వెళ్లిన సమయంలో ఆర్ వ్యాల్యూ 1.69 మాత్రమే ఉన్నది. అయితే, మూడో వేవ్ ప్రారంభానికి మందే ఆర్ వ్యాల్యూ 2.9గా నమోదుకావడానికి కారణం ఒమిక్రాన్ వేరియంట్ అని, ఒమిక్రాన్ కారణంగా కేసులు పెరుగుతున్నాయని, ఈ కొత్త వేరియంట్ డెల్టానే డామినెట్ చేస్తున్నది అనడానికి పెరుగుతున్న కేసులు, ఆర్ వ్యాల్యూనే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. నిబంధనలు పాటిస్తూ వ్యాక్సినేషన్ తీసుకుంటే ఈ మహమ్మారి ముప్పు నుంచి బయటపడొచ్చని ప్రొఫెసర్ ఝా పేర్కొన్నారు.
- Tags
- corona
- Covid 19
- Delta
- IIT
- IIT Madras
తాజావార్తలు
-
Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
-
New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
-
Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
-
Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
-
Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!