బాలీవుడ్ నూ కుదిపేస్తున్న కరోనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘వాక్సినేషన్ చేయించుకున్నప్పటికీ నాకు కరోనా వచ్చింది. దానికి సంబంధించిన తేలికపాటి లక్షణాలు నాకు ఉన్నాయి’ అని ‘పేజీ 3’ డైరెక్టర్ మధుర్ భండార్కర్ తెలిపారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారు కొవిడ్ టేస్టు చేయించుకోవాలని, అలానే కొవిడ్ 19 ప్రోటోకాల్ ను పాటించాలని మధుర్ కోరాడు. ఇదిలా ఉంటే ‘ఫోర్ మోర్ షార్ట్స్’ ఫేమ్ మాన్వీ గగ్రూకి సైతం కరోనా వచ్చింది.
కోవిడ్ 19కు సంబంధించిన తేలిక పాటి లక్షణాలు తనకున్నాయని, దాంతో విశ్రాంతి తీసుకుంటున్నానని ఓ ఫోటోతో పాటు మాన్వీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అలానే టెలివిజన్ సీరిస్ ‘ఘుమ్ హై కిసికే ప్యార్ మే’లో నటిస్తున్న ఆయేషా సింగ్ కు సైతం కొవిడ్ 19 పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దాంతో ఆ షోకు సంబంధించిన మొత్తం నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఆయేషా సింగ్ గురించి నిర్మాత రాజేశ్ రామ్ సింగ్ తెలియచేస్తూ, ‘ఆమెకు కరోనా లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించాం. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వెంటనే వైద్యం చేయించాం. ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉంది. దాంతో మొత్తం యూనిట్ సభ్యులకు కూడా టెస్టులు చేయించి, ఎవరికి వారిని కొద్ది రోజులు ఐసొలేషన్ లో ఉండాల్సిందిగా కోరాం. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నాం” అని అన్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో స్వర భాస్కర్, విశాల్ దద్లాని, జాన్ అబ్రహం, ఏక్తా కపూర్, రియా కపూర్ నోరా ఫతేహీ, అర్జున్ రామ్ పాల్, శిల్పా శిరోద్కర్ తదితరులు కరోనా బారిన పడి కోలుకున్నారు.
Also Read
- Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
- Kalki Sequel: 'కల్కి 2' నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
- RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
- Tridha: బాబీ డియోల్‌తో బోల్డ్ సీన్లే బ్రేకప్‌కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
తాజావార్తలు
-
Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
-
SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
-
IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
-
Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
-
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు విడుదల!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్‌ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!