సంక్రాంతి బరిలో దిగాల్సిన సిద్ధు జొన్నలగడ్డ మూవీ ‘డి.జె. టిల్లు’ విడుదల వాయిదా పడింది. వైరస్ విపరీతంగా స్ప్రెడ్ కావడంతో పాటు మూవీ కోర్ టీమ్ లోని కొందరు కరోనా బారిన పడటంతో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని మీడియాకు తెలియచేశారు. మూవీ విడుదల ఎప్పుడు చేసేది త్వరలో తెలియచేస్తామని అన్నారు. సంక్రాంతి బరి నుండి ‘ట్రిపుల్ ఆర్’ మూవీ తప్పుకోగానే జనవరి 14న తమ ‘డి.జె. టిల్లు’ను విడుదల చేస్తామని…
ప్రముఖ నటి ఖుష్బూ సైతం కొవిడ్ 19 బారిన పడింది. ఇటు నటన, అటు రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్న ఖుష్బూ ఈ మధ్యకాలంలో ఢిల్లీ కూడా చుట్టొచ్చింది. కరోనా రెండు వేవ్ లను తప్పించుకున్న తాను చివరకు దానికి దొరికిపోయానంటూ ఖుష్బూ సోషల్ మీడియాలో కొద్ది సేపటి క్రితం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం వరకూ తాను నెగెటివ్ లోనే ఉన్నానని, కొద్దిగా జలుబు ఉన్న కారణంగా ఈ రోజు చేయించుకున్న పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని…
‘ప్రేమ కావాలి’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన ఇషా చావ్లా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే నటసింహ నందమూరి బాలకృష్ణ సరసన ఆమె ‘శ్రీమన్నారాయణ’ చిత్రంలో నటించింది. అలాగే ‘పూలరంగడు’, ‘Mr పెళ్ళి కొడుకు’, జంప్ జిలాని, విరాట్, రంభ ఊర్వశి మేనక వంటి అనేక చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటి ఇషా చావ్లా. ప్రస్తుతం ఆమె కబీర్ లాల్ దర్శకత్వంలో 6 బాషల్లో వస్తున్న “దివ్య దృష్టి” సినిమాలో మెయిన్ లీడ్…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కారణంగా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కర్నూలు మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. కర్నూలోని మెడికల్ కాలేజీలో 15 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. మొత్తం 50 మంది వైద్య విద్యార్థులకు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా ఎంబీబీఎస్ ఫస్టీయర్ చదువుతున్న 11 మంది విద్యార్థులకు, నలుగురు హౌస్ సర్జన్‌లకు కరోనా సోకింది. మరో 40 మంది వైద్య విద్యార్థుల నుంచి శాంపిల్స్‌ను సేకరించి…
2022 వింటర్ ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు బీజింగ్ సిద్ధమయింది. ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు చేసింది. బీజింగ్‌ను జీరో కరోనా జోన్‌గా తీసుకొచ్చేందుకు అక్కడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు ఒమిక్రాన్ టెన్సన్ పట్టుకుంది. ఒమిక్రాన్ కేసులు ఆ దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. కట్టడి చేసేందుకు ఇప్పటికే బీజింగ్ చుట్టుపక్కల ఉన్న నగరాలలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఎలాగైనా వింటర్ ఒలింపిక్స్‌ను నిర్వహించి తీరాలని చైనా పట్టుబడుతున్నది. ఇదిలా ఉంటే, బీజింగ్‌కు సమీపంలో ఉన్న షియాన్…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. గత కొన్ని రోజులుగా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు బయటపడిన తరువాత కరోనా ఉధృతి భారీగా పెరిగింది. కరోనా కారణంగా అన్నింటిని మూసేస్తున్నారు. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కరోనా తగ్గడం లేదు. పైగా కొత్త కొత్త పేర్లతో వైరస్ పుట్టుకొస్తున్నది. ఇజ్రాయిల్‌లో ఇటీవలే ఫ్లురోనా అనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇన్‌ఫ్లుయెంజా, కరోనా రెండు ఒకే వ్యక్తిలో బయటపడితే ఫ్లురోనా…
ఢిల్లీని కరోనా వణికిస్తోంది. కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇప్పటికే పార్లమెంట్‌లో 400 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో పార్లమెంట్‌లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ టెస్టులు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు సుప్రీంకోర్టులో కరోనా కలకలం రేగింది. సుప్రీంకోర్టులో కరోనా కేసులు వరసగా బయటపడుతున్నాయి. కోర్టులో 3 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు 150 మందికి కరోనా నిర్ధారణ జరిగింది. Read: ఢిల్లీ బాటలో రాజస్థాన్… ప్రజలకు…
ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ తో పాటు వీకెండ్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బాటలో ఇప్పుడు రాజస్థాన్ కూడా అడుగులు వేస్తున్నది. రాజస్థాన్‌లో భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో 5660 కొత్త కేసులు నమోదవ్వగా ఒకరు మృతిచెందారు. రాష్ట్రంలో 19,467 యాక్టీవ్ కేసులు ఉండగా, 24 గంటల్లో 358 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే, కేసులు క్రమంగా పెరుగుతుండటంతో అశోక్ గెహ్లాట్ సర్కార్…
దేశంలోకి థర్డ్ వేవ్ ఎంటర్ అయిందని చెప్పడానికి పెరుగుతున్న కేసులే ఉదాహరణగా చెప్పవచ్చు. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, ముంబై, ఢిల్లీ వంటి మహానగరాల్లో ప్రతిరోజూ కేసులు పీక్స్‌లో నమోదవుతున్నాయని, జనవరి మిడిల్ వరకు 30 వేల నుంచి 60 వేల మధ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్త మహీంద్రా అగర్వాల్ పేర్కొన్నారు. కేసులతో పాటు ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్యకూడా…