టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన భార్యపై చేసిన ‘నెగెటివ్’ కామెంట్స్ కు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నితిన్ తన తాజా పోస్ట్ లో కేక్ కోస్తూ మొదటిసారి తన భార్య నెగెటివ్ కావాలని కోరుకుంటున్నాను అంటూ వీడియోను పోస్ట్ చేశాడు. అయితే నితిన్ కింద కేక్ కోస్తూ ఉండగా, ఆయన భార్య పైన ఇంట్లో ఉన్న కిటికీ దగ్గర నిలబడి చూస్తోంది. అలా ఎందుకంటే నితిన్ భార్యకు కరోనా పాజిటివ్ గా…
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది మాయదారి కరోనావైరస్.. ఎప్పటికప్పుడు రూపాంతరాలు చెందుతూ ప్రజలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది.. డెల్టా వేరియంట్ రూపంలో భారత్‌లో సెకండ్ వేవ్ విధ్వంసమే సృష్టించగా.. ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో పంజా విసురుతోంది.. ఇప్పటికే దేశంలో కరోనా థర్డ్ వే ప్రారంభమై పోయింది.. 15 రాష్ట్రాల్లో థర్డ్‌వేవ్ స్టార్ట్ అయినట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు.. ఓవైపు డెల్టా వేరియంట్, మరోవైపు ఒమిక్రాన్ ఇప్పుడు క్రమంగా కేసులు పెరగడానికి కారణం అవుతున్నాయి… మూడు, నాలుగు రోజుల క్రితం 20…
చిత్ర పరిశ్రమలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. ” నా ప్రియమైన అభిమానులకు.. శ్రేయోభిలాషులకు.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నేను కరోనా బారిన పడ్డాను. స్వల్ప లక్షణాలతో కరోనా…
కరోనాకు వారు వీరు అనే తేడాలేదు. ఎవర్నీ వదలడం లేదు. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, తాజాగా మరో సీఎం కరోనా బారిన పడ్డారు. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కరోనా బారిన పడినట్టు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. లక్షణాలు పెద్దగా లేవని, వైద్యుల సలహా మేరకు వారం రోజులపాటు హోమ్ ఐసోలేషన్‌లో…
గత యేడాది చివరి వారంలో మంచు మనోజ్ కుమార్ కరోనా బారిన పడ్డాడు. ఆరోగ్యం బాగానే ఉన్నా, కొవిడ్ టెస్టు చేయించుకున్నప్పుడు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇప్పుడు అదే కరోనా… మంచు లక్ష్మీని పట్టుకుంది. దాదాపు రెండు సంవత్సరాలుగా కరోనా బారి పడకుండా తప్పించుకున్నానని, ఆ దోబూచులాటలో చివరకు ఇప్పుడు దాని చేతికి చిక్కిపోయానని మంచు లక్ష్మీ తెలిపింది. ఇదే సమయంలో ప్రతి ఒక్కరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం కూడా…
కొత్త సంవత్సరం వేడుకలు ముగిసిన రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. వారం క్రితం రోజువారి కేసులు పదివేల లోపు ఉండగా, ఇప్పుడు రోజువారి కేసుల సంఖ్య 90 వేలు దాటింది. ఢిల్లీ, మహారాష్ట్రలో కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. దేశరాజధానిలో గడిచిన 24 గంటల్లో 15,097 కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కరోనాతో మృతి చెందారు. ఇది కొంత ఊరటనిచ్చే అంశమే. కేసులు పెరుగుతున్నా మరణాల…
షారూఖ్ ఖాన్ నటిస్తున్న ‘పఠాన్’, సల్మాన్ నటించిన ‘టైగర్3’ సినిమాల విడుదల 2023లోనే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సల్మాన్, కత్రినా కైఫ్ నటించిన ‘టైగర్3’లో సీరీస్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించాడు. మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ ఫ్రాంచైజీ 2021లో విడుదల అవుతుందని ప్రకటించారు. అయితే కరోనా వల్ల 2022కి మారింది. ఇప్పుడు ఏకంగా 2023లో రాబోతున్నట్లు వినిపిస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ…
రోజురోజుకు కరోనా ఉదృతి పెరుగుతూనే ఉంది. చిత్ర పరిశ్రమలో ఒకరి తరువాత ఒకరు కరోనా బారిన పడడం భయాందోళనలకు గురిచేస్తుంది. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ అని లేకుండా పలువురు స్టార్లు కరోనా బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా కూడా కరోనా బారిన పడ్డారు. ఆమె కాకుండా ఆమె ఫ్యామిలీ అంతా కరోనాతో పోరాడుతున్నారు. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా…