కొవిడ్‌కు పుట్టినిల్లు అయిన చైనాలో మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దాదాపు ఒక్క నెలలోనే కొవిడ్ సోకి 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారని చైనా ఆరోగ్య శాఖ అధికారులు నివేదించారు.
అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో వివిధ రకాల వేరియంట్లు వెలుగులోకి వస్తున్నాయి భారత్‌కు వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 11 రకాల కరోనా వేరియంట్లు బయటపడ్డట్లు అధికార వర్గాలు తెలిపాయి.
దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే.. శనివారం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 5,664 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. కరోనా మహమ్మారి బారిన పడి 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే.. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 5,747 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది.
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే.. బుధవారం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 6,422 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది.