China: చైనాలో కొవిడ్ కల్లోలం.. 35 రోజుల్లోనే 60 వేల మరణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Covid: కొవిడ్‌కు పుట్టినిల్లు అయిన చైనాలో మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దాదాపు ఒక్క నెలలోనే కొవిడ్ సోకి 60 వేల మంది ప్రాణాలు కోల్పోయారని చైనా ఆరోగ్య శాఖ అధికారులు నివేదించారు. డిసెంబర్ ప్రారంభంలో కొవిడ్ ఆంక్షలను సడలించిన తర్వాత మొదటి సారిగా ప్రభుత్వం మరణాల సంఖ్యను విడుదల చేసింది. డిసెంబర్ 8, 2022 నుంచి జనవరి 12, 2023 మధ్య చైనాలో 59,938 కొవిడ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయని నేషనల్ హెల్త్ కమిషన్ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ అధిపతి జియావో యాహుయ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సంఖ్య వైద్య సదుపాయాల వద్ద అంటే ఆస్పత్రుల్లో నమోదైన మరణాలను మాత్రమే సూచిస్తుంది. మొత్తం సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఇందులో వైరస్ కారణంగా నేరుగా శ్వాసకోశ వైఫల్యం వల్ల సంభవించిన 5,503 మరణాలు కాగా.. కొవిడ్‌తో కలిపి అంతర్లీన వ్యాధుల వల్ల 54,435 మరణాలు సంభవించాయని జియావో చెప్పారు. డిసెంబర్ ప్రారంభంలో జీరో-కోవిడ్ విధానాన్ని విడిచిపెట్టినప్పటి నుంచి చైనా వైరస్ మరణాల సంఖ్యను తక్కువగా నివేదించిందని ఆరోపించారు. చైనా గతంలో కొవిడ్ మరణాలను వర్గీకరించడానికి దాని పద్ధతిని సవరించింది. ఇది వైరస్ వల్ల కలిగే శ్వాసకోశ వైఫల్యంతో ప్రత్యేకంగా మరణించేవారిని మాత్రమే లెక్కిస్తుంది. అయితే దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ విమర్శించింది.
Also Read
- Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
- Captain Farhan Yousaf: భారత్‌పై విజయం సాధించేందుకు ఈ ప్లాన్ వేశాం.. సక్సెస్ అయ్యాం..
- India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
- Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు..
Pakistan: పోలీస్ స్టేషన్‌పై తాలిబన్ల దాడి.. ముగ్గురు పాక్ పోలీసులు మృతి
చైనాలో మరణించిన వారిలో ఎక్కువగా 65 సంవత్సరాల కంటే అధిక వయస్సు గలవారే 90 శాతానికి పైగా ఉన్నారని తెలిసింది. చాలా మంది అంతర్లీన వ్యాధులతో బాధపడుతున్నారని వారు చెప్పారు. చైనాలో 60 ఏళ్లు పైబడిన లక్షలాది మందికి టీకాలు వేయలేదు.
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అత్యంత జాగ్రత్త.. మీరున్నారో చూసుకోండి!
-
Delhi Air Pollution After Diwali: ఢిల్లీలో మళ్లీ తీవ్ర వాయు కాలుష్యం.. AQI 366కు చేరిక, పొగమంచుతో కప్పుకున్న నగరం
-
Iran Nuclear Talks: ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు?.. అణు చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Dhanush: సాయిపల్లవికి సపోర్ట్‌గా స్టార్ హీరో.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ధనుష్!
-
Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!