Corona Cases: దేశంలో మళ్లీ తగ్గిన కొవిడ్ కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corona Cases In India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే.. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 5,747 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. కరోనా మహమ్మారి బారిన పడి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 46 వేల పైకి చేరుకుంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 46,848కు చేరాయి.
దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 4,45,28,524కి చేరుకుంది. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,28,302గా ఉంది. ఇండియాలో 4,39,53,374 మంది వ్యాధి బారినుంచి కోలుకున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 1.69 శాతంగా ఉంది. దేశంలో శుక్రవారం 23,92,530 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 216.41 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,40,211 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు. భారతదేశంలో కొవిడ్ మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి చూస్తే.. డిసెంబర్, 2020లో కోటి కేసులు నమోదు అవ్వగా.. ఈ సంఖ్య మే 4,2021 నాటికి రెండు కోట్లకు, జూన్ 23,2021 నాటికి మూడు కోట్లకు.. జవవరి 25, 2022 నాటికి నాలుగు కోట్ల మైలురాయిని చేరుకుంది.
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
Lucknow Wall Collapse: శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తిని ఫోన్ కాల్ రక్షించింది..
ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కొన్ని దేశాల్లో కొవిడ్ వ్యాధి విజృంభిస్తోంది. కొత్తగా 4,71,831 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,663 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,64,91,369కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,29,069 మంది మరణించారు. మరో 5,65,492 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,56,72,593కు చేరింది. జపాన్‌లో కొత్తగా 88,379 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 170 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియాలో కొత్తగా 51,832 కేసులు వెలుగుచూశాయి. మరో 60 మంది మరణించారు.రష్యాలో 59,035 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 110 మంది మృతి చెందారు. తైవాన్‌లో 41,670 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 46 మంది ప్రాణాలు కోల్పోయారు.అమెరికాలో 39,301 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 270 మంది మృతి చెందారు.
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!