Teacher On Flag Hoisting: జెండా వందనం చేయను.. చేస్తే నా మతం ఒప్పుకోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teacher On Flag Hoisting: స్వాతంత్ర దినోత్సవం రోజు మతాలకతీతంగా, కులాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందరూ జెండా వందనం చేస్తారు. మేరా భారత్ మహాన్ అంటూ గర్వం వ్యక్తం చేస్తారు. అయితే ఓ మహిళ మాత్రం తాను జెండా వందనం చేసేది లేదంటూ తెగేసి చెప్తోంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు ధర్మపురి జిల్లాలోని ఓ పాఠశాలలో తమిళసెల్వి అనే మహిళ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. పంద్రాగస్టు రోజు స్కూల్‌కు హాజరుకావాల్సిన ఆమె సెలవు పెట్టి గైర్హాజరు అయ్యారు. అయితే ఆమె తాను సెలవు పెట్టడానికి గల కారణంపై తోటి టీచర్లకు ఓ వీడియో సందేశం పంపించారు. తాను క్రిస్టియన్‌ను అ ని, దేవుడికి తప్ప మరెవరికీ వందనం చేయడానికి తమ మతం ఒప్పుకోదని సదరు వీడియోలో తమిళసెల్వి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Read Also: బీపీ ఉన్న వాళ్లు ఈ ఆహారానికి దూరంగా ఉండాల్సిందే..
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
తాము విశ్వసించే దేవుడికి తప్ప మరెవరికీ నమస్కరించేది లేదని.. తనకు బదులుగా అసిస్టెంట్ హెడ్‌మాస్టర్‌తో జెండా ఆవిష్కరణ చేయించాలని వీడియోలో తోటి టీచర్లకు తమిళ సెల్వి సూచించారు. దీంతో ప్రధానోపాధ్యాయురాలు తమిళ సెల్వి వివరణపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాను మత విశ్వాసాలను పూర్తిగా అనురిస్తానని తమిళ సెల్వి వివరించారు. తనకు జాతీయ పతాకంపై గౌరవం ఉందని.. కానీ తన మతం చెప్పిందే అనుసరిస్తున్నానని తెలిపారు. తనకు జాతీయ జెండాను అవమానించే ఉద్దేశం ఎంతమాత్రం లేదన్నారు. ఈ ఏడాది తమిళసెల్వి రిటైర్ అవుతున్నారు. ఆమె రెండు సంవత్సరాల క్రితం ఉద్యోగం నుండి పదవీ విరమణ చేయవలసి ఉంది. అయితే కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ప్రభుత్వం వయోపరిమితిని 60 సంవత్సరాలకు పొడిగించడంతో ఆమె ఈ సంవత్సరం పదవీ విరమణ చేయనున్నారు. కాగా గతంలో జెండా వందనం చేయాల్సిన రోజుల్లో కూడా తమిళసెల్వి సెలవు పెట్టేవారని స్కూల్ స్టాఫ్ వివరించారు.
நாங்கள் கிறிஸ்தவர்கள், இந்திய கோடிக்கு வணக்கம் செய்ய மாட்டோம், என்று கூறுகிறார் அரசு பள்ளியின் கிறிஸ்தவ தலைமை ஆசிரியை. pic.twitter.com/t3j9JXOXaJ
— இந்து நாடார் (@ramaiyyah) August 16, 2022
తాజావార్తలు
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!