ఆధ్యాత్మిక బోధకురాలు జయ కిషోరి సోషల్ మీడియా వేదికగా ఆమె విమర్శల పాలయ్యారు. 29 ఏళ్ల వయసులోనే ఆధ్మాత్మిక బోధనలతో.. భజన పాటలతో దేశ వ్యాప్తంగా మంచి ఫేమస్ అయ్యారు. మానవ జన్మ గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు.
దశాబ్దాల తర్వాత సుప్రీంకోర్టులో న్యాయమాత విగ్రహాన్ని మార్చడంపై బార్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మార్పు చేసే ముందు తమ సభ్యులతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోణలు నేపథ్యంలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసినసంగతి తెలిసిన విషయమే. ఓ షో కోసం జానీ మాస్టర్ తో కలిసి ముంబైకి వెళ్ళినప్పుడు హోటల్లో తనపై అత్యాచారం చేసాడని, ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దు అంటూ బెదిరించడని, అలాగే షూటింగ్ సమయంలో అసభ్యంగా ప్రవర్తించేవాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చెసాడని నార్సింగి పోలీసులకు జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశాన్ని కుదిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు, ఆయా పార్టీలు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తు్న్నారు. తాజాగా ఇదే వ్యవహారంపై గురువారం సుప్రీంకోర్టు విచారించింది.
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బీజేపీ మహిళా అభ్యర్థులపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి.
నాగార్జున సాగర్ జలాల విడుదల వివాదం ముగిసింది. నవంబర్ 28కి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగిస్తూ.. ఈ డ్యామ్ నిర్వహణను కృష్ణ వాటర్ మేనేజ్మెంట్ కు అప్పగించడంతోపాటు సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలన్న కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి ప్రతిపాదనలకు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించాయి. నాగార్జున సాగర్ డ్యామ్ నుండి నవంబర్ 29న ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా సాయుధ దళాలను మోహరించి.. కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన సందర్భంగా వివాదం తలెత్తింది.
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఉద్రక్తతపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదు అన్నారు.. ఆంధ్ర భూభాగంలో తెలంగాణ పోలీసులు ఉంటున్నారు.. మా నీరు మా రైతులకు విడుదల చేయాలంటే తెలంగాణ అనుమతి ఎందుకు?.. మా భూభాగంగలోకి మా పోలీసులు వెళ్తే దండయాత్ర ఎలా అవుతుంది? అని ఆయన ప్రశ్నించారు.
ఎంత పెద్ద హీరోలైనా ఆచీతూచీ మాట్లాడకపోతే వివాదాలపాలు కావడం పక్కా. ఇప్పుడు అలాంటి వివాదంలోనే నాచురల్ స్టార్ నాని చిక్కుకున్నారు. ఆయన మీద టాలీవుడ్ బడా హీరోల ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు విషయం ఏంటంటే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘కింగ్ ఆఫ్ కోతా’ పాన్ ఇండియా రేంజ్లో ఈ నెల 24న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమానికి న్యాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ…
జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా వివాదంలో చిక్కుకున్నారు. వీడియో కాల్ ఆయన మంత్రి పదవికి ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది. ఓ మహిళతో చాట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మంత్రి నిర్వాకంపై దర్యాప్తు జరపాలని.. ఆయన వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.