Rahul Ramakrishna: టాలీవుడ్‌లో రాహుల్ రామకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తనకు సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తూ రాహుల్ రామకృష్ణ హాట్ టాపిక్ అవుతుంటాడు. తాజాగా ఈరోజు గాంధీ జయంతి కావడంతో గాంధీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు గాంధీని ఉద్దేశిస్తూ నటుడు రాహుల్ రామకృష్ణ ఓ ట్వీట్ చేశాడు. అందులో ‘గాంధీ గొప్పవాడని నేను అనుకోను’ అని రాసుకొచ్చాడు. గాంధీ జయంతి నాడు రాహుల్ రామకృష్ణ ఈ ట్వీట్ చేయడంతో చర్చకు దారి తీసింది. ఈరోజు మందు దొరకదు కాబట్టి మహాత్మా గాంధీని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశాడని కొందరు నెటిజన్‌లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ ఈ ట్వీట్ చేశాడని అభిప్రాయపడుతున్నారు.
I don’t think Gandhi was great
— Rahul Ramakrishna (@eyrahul) October 2, 2022
కాగా రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ అతడు పలు సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. మూవీ రివ్యూలు రాసేవారిపై బూతుపదం వాడటంతో రాహుల్ రామకృష్ణ ట్రోలింగ్‌కు గురయ్యాడు. గు** దమ్ముంటే.. సినిమా తీయండ్రా ఇడియట్స్ అంటూ ట్వీట్ చేయడంతో నెటిజన్‌లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రివ్యూలు రాస్తే తప్పేంటని మండిపడ్డారు. దీంతో రాహుల్ రామకృష్ణ తగ్గి ఆ ట్వీట్‌ను డిలీట్ చేయడంతో వివాదం సద్దుమణిగింది.
Read Also:CM Jagan: మరోసారి సీఎం జగన్ మంచి మనసు.. ఓ చిన్నారికి రూ.కోటి మంజూరు