Bhatti Vikramarka: తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం.. కానీ ఓ కుటుంబానికి మాత్రమే జాబ్స్ వచ్చాయి!
- ఖమ్మం జిల్లా మధిరలో మెగా జాబ్ మేళా
- ఒకేరోజు 5 వేల మందికి ఉపాధి
- ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాలు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అని, తెలంగాణ తెచ్చుకున్నాక ఓ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో నిరుద్యోగులందరికీ పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకేజీలతో సమయం అయిపోయిందని, కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో మెగా జాబ్ మేళా కార్యక్రమం జరిగింది. ఒకేరోజు 5 వేల మందికి ఉపాధి దక్కింది. ఉద్యోగాలు పొందిన వారికి డిప్యూటీ సీఎం భట్టి నియామకపత్రాలు అందజేశారు.
మెగా జాబ్ మేళా కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ… ‘తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. తెలంగాణ తెచ్చుకున్నాక ఓ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రజా పాలనలో నిరుద్యోగులందరికీ పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకేజీలతో సమయం అయిపోయింది. కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు కల్పిస్తున్నాం. గత పది సంవత్సరాల్లో నిరుద్యోగులు, ఉద్యోగులు ఫలితాలు సాధించలేకపోయారు. ప్రజా ప్రభుత్వంలో మూడంచల్లో ఉద్యోగాల కల్పిస్తున్నాం. ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలు, రెండు బహుళ జాతి సంస్థలకు వనరులు ఏర్పాటు చేసి రాష్ట్ర యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు, మూడు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాజీవ్ యువ వికాసం, జాబ్ మేళాలు. 5,000 మందికి యువతకు ఉపాధి కల్పించేందుకు హైదరాబాదులో మరో నాలెడ్జ్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. మధిర జాబ్ మేళా ద్వారా 5,000 మందికి ఒకేరోజు ఉపాధి లభించింది. రాష్ట్ర వనరులు, రాష్ట్ర భవిష్యత్తుకు, జీడీపీ పెరుగుదలకు, కుటుంబానికి, సమాజానికి పెద్ద ఎత్తున యువత ఉపయోగపడాలి. ప్రతి ఆలోచన మంచిది అయితే మంచి ఫలితాలు సాధిస్తారు. యువత మత్తు పదార్థాలు, సంఘవిద్రోహశక్తులకు దూరంగా ఉండాలి. చివరి దశలో తల్లిదండ్రులు బాధపడకుండా యువత చూసుకోవాలి’ అని అన్నారు.
Also Read
- Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
- National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
- Nitin Gadkari: అండర్‌వరల్డ్, రెడ్‌లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
-
National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
-
Nitin Gadkari: అండర్‌వరల్డ్, రెడ్‌లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..
-
CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
-
Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!