తెలంగాణ గొంతుక కాదు.. గొంతు కోసిన పార్టీ బీఆర్ఎస్ అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అర్జెంట్‌గా సీఎం ఎందుకు అవ్వాలో కేటీఆర్ చెప్పాలన్నారు. బీఆర్ఎస్ వద్దనే కదా ప్రజలు ఇంటికి పంపిందని, ప్రభుత్వం మీద విష ప్రచారం ఎందుకు? అని ప్రశ్నించారు. తుపాకీ రాముడు, అగ్గిపెట్టె హరీష్, లిక్కర్ కవిత తప్పితే.. పార్టీ పెట్టినప్పుడు ఉన్నోళ్లు ఇప్పుడు ఎవరు ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకే రాని కేసీఆర్‌ను మరలా సీఎం చేయాలా?, పదేళ్లు అధికారంలో ఉండి సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేదు అని ఎంపీ చామల ప్రశ్నించారు.
‘రజతోత్సవం ఏ పార్టీదో కేటీఆర్ చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీనే లేదు, బీఆర్ఎస్ ఏర్పడి 25 ఏళ్లు కాలేదు. కేసీఆర్ అర్జెంట్‌గా సీఎం ఎందుకు అవ్వాలో కేటీఆర్ చెప్పాలి. అర్జెంట్‌గా వచ్చి ఏం చేస్తాడు.. పదేళ్లు 7 వేల కోట్లు అప్పులు చేశారు. మీరు వద్దనే కదా ప్రజలు ఇంటికి పంపింది, ప్రభుత్వం మీద విష ప్రచారం ఎందుకు?. తెలంగాణ గొంతుక కాదు.. గొంతు కోసిన పార్టీ బీఆర్ఎస్. తుపాకీ రాముడు, అగ్గిపెట్టె హరీష్, లిక్కర్ కవిత తప్పితే.. పార్టీ పెట్టినప్పుడు ఉన్నోళ్లు ఇప్పుడు ఎవరు ఉన్నారు. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి.. కోట్లు ఖర్చు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్లు, బీఆర్ఎస్ వాళ్ల డబ్బులు ఇంటింటికి రావాలి, ప్రజలు వసూలు చేయండి’ అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
‘దళితున్ని సీఎం చేస్తా అని మోసం చేసినందుకు కేసీఆర్ సీఎం అవ్వలా?, మూడు ఎకరాలు ఇస్తా అని మోసం చేసినందుకు సీఎంను చేయాలా?, కాళేశ్వరం పేరుతో దోచుకున్నదుకా?, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకే రాని కేసీఆర్‌ను మరలా సీఎం చేయాలా?. కేసీఆర్ మంచి అడ్మినిస్ట్రేటర్ అయితే తెలంగాణ అప్పుల పాలు ఎట్లా అయ్యేది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనం చేయడం తప్పితే ఏముంది? మీరు చేసేది. కాళేశ్వరం పేరుతో దక్షిణ తెలంగాణని ఎందుకు పక్కన పెట్టారు. కేసీఆర్ బాపు కాదు. రజతోత్సవంలో ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ దోచుకున్నది అందరికీ తెలుసు. కేసీఆర్..రజతోత్సవంలో బీసీని అధ్యక్షుని చేస్తారు అని సమాచారం ఉంది. మేము ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ చేసిన కులగణన వల్ల బీఆర్ఎస్ పార్టీకి బీసీ అధ్యక్షుని ఆలోచన వచ్చింది’ అని ఎంపీ చామల రైతు మహోత్సవం కార్యక్రమంలో చెప్పారు.