Jagga Reddy: రాహుల్ గాంధీ జోడో యాత్రలో దేశ ప్రజల సమస్యలకు పరిష్కారం చేసే దిశగా అడుగులు వేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. భారత్ జోడో యాత్రలో ప్రధాన అంశం కుల గణన.. కుల గణన చేయాలని రాహుల్ గాంధీ పదే పదే చెప్పారు.. ఇప్పుడున్న కేంద్రం కుల గణన చేస్తామని ప్రకటన చేయడం స్వాగతిస్తున్నాం.. రాహుల్ గాంధీ ముందు చూపుతో ఉన్నాడు అనడానికి కుల గణన ఒకటి.. దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ హీరో.. రాష్ట్రంలో కుల గణన చేసినందుకు రేవంత్ రెడ్డి హీరో అని కొనియాడారు. ఇప్పుడు బీజేపీ వాళ్లు సంకలు గుద్దుకున్న లాభం లేదు.. రాహుల్ గాంధీకి ఎంత ముందు చూపు ఉందో అర్ధం అవుతుంది.. మోడీ చేయకపోతే.. రాహుల్ గాంధీ ప్రధాని కాగానే ఆయనే చేసే వాడు అని జగ్గారెడ్డి తెలిపారు.
Read Also: PM Modi Tour: ప్రధాని మోడీ అమరావతి టూర్.. 5 లక్షల మంది, 6600 బస్సులు!
అయితే, రాష్ట్రంలో కుల గణన లెక్కలోకి రాని వారు.. కేంద్ర కుల గణనలో లెక్కకు వస్తారు అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రెండేళ్ల క్రితమే మోడీ చెప్తే బాగుండేది అనుకుంటున్నారు.. రాహుల్ గాంధీకి క్రెడిట్ వస్తుందని బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదు.. రాహుల్ గాంధీ అనే వరకు మోడీ ఎందుకు ఎదురు చూశాడు? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి వచ్చిన ఐడియా మోడీకి ఎందుకు రాలేదంటూ సెటైర్లు వేశాడు. బీజేపీ వాళ్ళ లెక్క పదవుల కోసం ఎదురు చూసే రకం కాదు రాహుల్ కుటుంబం.. వాళ్ళే ప్రధాన మంత్రులను చేస్తారు.. కొందరికి భయం ఉంటది.. రేవంత్ కుల గణన చేసి మార్కులు కొట్టి పడేశాడన్నారు. రేవంత్ కూడా అదృష్టవంతుడు.. రాహుల్ గాంధీ లైన్ లో వెళ్లి జాక్ పాట్ కొట్టేశాడు అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు.
Read Also: Namaz: విద్యార్థులతో బలవంతంగా ‘‘నమాజ్’’ చేయించే యత్నం.. ప్రొఫెసర్ అరెస్ట్..
ఇక, కిషన్ రెడ్డి ఇప్పుడు ఏం అన్నా లాభం లేదు అని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. సుష్మ స్వరాజ్ 2010లో అంటే.. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు మీరు.. మీరేం చెప్పినా కుల గణన హీరో రాహుల్ గాంధీ.. కుల గణనలో ఇతర మతాల వారు ఉండరని కిషన్ రెడ్డి కాదు మోడీ చెప్పాలి..
కిషన్ రెడ్డికి ఇష్టం లేదు కదా అని వదిలేస్తారా..?.. ప్రధాని ఏం చెప్తారో చూసి మాట్లాడదాం.. ముస్లింలు భారత దేశ పౌరులు కదా..? అని ప్రశ్నించారు. దేశంలో పుట్టిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అంతా భారత దేశ బిడ్డలే కదా అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.