CWC Meeting: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం శుక్రవారం ఢిల్లీలో జరుగనుంది. రేపు సాయంత్రం 4 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. ఇందుకు ఏఐసీసీ పాత కార్యాలయం వేదిక కానుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు చెందిన సీఎంలు హాజరవుతున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సుఖు హాజరు అవుతారు.
Read Also: Chandrababu: నెల్లూరుపాలెంలో పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు
కేంద్ర ప్రభుత్వం బుధవారం జరిగిన కుల గణనపై సంచలన నిర్ణయం ప్రకటించింది. నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో జనాభా లెక్కలతో పాటే కులగణన నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కుల గణనపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. దీనిపై తదుపరి కార్యాచరణ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ ‘‘కులగణన’’ చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్‌తో పాటు ఇండీ కూటమి పార్టీలు కూడా కుల గణనను సపోర్ట్ చేశాయి. ప్రతిపక్షాలకు షాక్ ఇస్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కులగణనపై నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.