తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు పంచాయతీ అంతా.. పదవుల కోసమే. వీలైనంత త్వరలో పిసిసి కమిటీతోపాటు.. కార్పొరేషన్ చైర్మన్స్ ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. దీంతో ఆశావాహులంతా పార్టీ నాయకత్వం చుట్టూ తిరుగుతున్నారు. ఎవరి ట్రయల్స్లో వాళ్ళు ఉన్నారు. అంతవరకైతే ఫర్లేదుగానీ.... ఏకంగా గాంధీభవన్లో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఛాంబర్ ముందు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. తన సహజ శైలికి భిన్నంగా వీధి భాష వాడుతున్నారన్న అభిప్రాయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో బలపడుతోంది. తన నియోజక వర్గంలోని ఒక ప్రాంతంలో ప్రజలకి స్థానిక తహశీల్దార్ నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు ఎంపీ. ఆ టైంలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ... నోరు జారారు. సీఎంని అనకూడని మాట అనేయడంతో... ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈటల ఇంటి ముట్టడికి కూడా పిలుపునిచ్చింది అధికార పార్టీ.
Shashi Tharoor: భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు హస్తం పార్టీకి రుచించడం లేదు. కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం థరూర్ ‘‘లక్ష్మణ రేఖ’’ దాటారని భావిస్తున్నారు. అయితే, దీనిపై శశి థరూర్ స్పందించారు. ‘‘భారతీయుడిగా గర్వించదగిన పౌరుడిగా ఈ వ్యాఖ్యలు చేశాను’’ అని స్పష్టం చేశారు.
వరంగల్ జిల్లాలో అందాల భామల హెరిటేజ్ వాక్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కావాలనే కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Congress : కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ గాంధీ భవన్ లోని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చాంబర్ ఎదుట రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలు బుధవారం నిరసన చేపట్టారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఆధ్వర్యంలో మహిళా నాయకులు ఆందోళనకు దిగారు. పార్టీకి అండగా నిలిచిన మహిళా నేతలకు గౌరవం లేకుండా, పదవులు, ప్రభుత్వం, కార్పొరేషన్ లలో ఉన్నతస్థానాలు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ బంధువులకే…
KTR: ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో నిర్వహించిన కీలక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని పీడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు. హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రజలకు వివరించండి అన్నా
ఆలూరు కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణ హత్య కేసు తీవ్ర కలకలం రేపింది.. అయితే, ఈ కేసులో కొత్త మలుపు తిరుగుతుంది. ఈ కేసులో మాజీ మంత్రి, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కజిన్ గుమ్మనూరు నారాయణను అరెస్ట్ చేశారు పోలీసులు.. గుమ్మనూరు నారాయణ ఇంట్లో సీసీ టీవీ ఫుటేజీ స్వాధీనం చేసుకున్నారు.
Telangana Govt: తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది అని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 61.45 శాతం యాసంగి వడ్ల కొనుగోళ్లు పూర్తి అయినట్లు పేర్కొనింది. మే 12వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది అన్నారు.
Bhatti Vikramarka: భద్రాద్రి కొతగూడెం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గంలో గల బయ్యారం టేకులపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు స్వయం ఉపాధితో ఎదగడానికి రాజీవ్ యువ వికాసం వరం లాంటిది అన్నారు.
కేటీఆర్ కు నాయకత్వం అప్పగిస్తే సహకరిస్తాను అని తేల్చి చెప్పారు. నేను క్రమ శిక్షణ గల పార్టీ కార్యకర్తను.. గత 25 ఏళ్లుగా పార్టీలో నిబద్ధతో పని చేస్తున్నాను.. నా లీడర్ కేసీఆర్.. ఆయన చెప్పినట్లు నడుచుకుంటానని హరీశ్ రావు తెలిపారు.