మైసూర్ శాండల్.. దీని పేరు తెలియని వాళ్లు ఉండరు. భారతదేశంలో చాలా ఫేమస్ సబ్బు. ఎందుకంటే ప్రతి ఇంట్లో మైసూర్ శాండల్ సబ్బులు ఉంటాయి. అంతగా ఫేమస్. స్నానానికి ఎక్కువ శాతం ఈ సోప్‌లనే ఉపయోగిస్తుంటారు. ఈ సోప్ మంచి సువాసనలను వెదజల్లుతుంటుంది. అందుకే ఈ సబ్బును ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు దీని గురించి ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
ఇది కూడా చదవండి: Miss World 2025 : మిస్ వరల్డ్ 2025 హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ ఫైనలిస్టుల జాబితా విడుదల
మొట్టమొదటి మైసూర్ శాండల్ సబ్బు 1961లో తయారు చేయబడింది. దీనికి దాదాపు 110 సంవత్సరాలు చరిత్ర ఉంది. ఇది కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంటుంది. ప్రస్తుతం ఈ సోప్ ప్రాంతీయ వివాదానికి తెర లేపింది. మైసూర్ శాండల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ముంబైలో జన్మించిన బాలీవుడ్ నటి తమన్నా భాటియాను కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం నియమించుకుంది. తమన్నాతో రెండేళ్ల ఒప్పందానికి సంతకం చేసింది.
ఇది కూడా చదవండి: US: త్వరలోనే పెళ్లి.. ఇంతలో దుండగుడి కాల్పుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి
ఇప్పుడు ఈ వ్యవహారమే రాజకీయ దుమారం రేపుతోంది. మైసూర్ శాండల్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి తమన్నాను ఎలా నియమిస్తారంటూ కన్నడ సంఘాలు, స్థానిక కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. మైసూర్ శాండిల్ సోప్ కర్ణాటక సాంస్కృతికకు వారసత్వం అని.. అంతేకాకుండా ప్రాంతీయవాదానికి ఒక బ్రాండ్ అని.. అలాంటిది కన్నడ నటిని కాకుండా.. బాలీవుడ్ నటిని ఎలా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటారని సిద్ధరామయ్య ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే తమన్నాతో ఒప్పందాన్ని రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అధికారికంగా లేఖ రాశారు. కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ గౌడ్రు ఒక బహిరంగ లేఖలో నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఈ నిర్ణయం ‘‘అనైతికమైనది, బాధ్యతారహితమైనది మరియు కన్నడిగుల మనోభావాల నుంచి డిస్‌కనెక్ట్ చేయబడింది’’ అని అభివర్ణించారు.
1916లో అప్పటి మైసూర్ మహారాజు కృష్ణరాజ వడయార్ మైసూర్ శాండల్ సోప్ స్థాపించారు. అయితే సోప్ అంబాసిడర్‌గా తమన్నాకు రూ.6.2 కోట్లు కేటాయించారు. అయితే ఆమెకు ఖర్చు చేసే డబ్బులు.. విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా కర్ణాటకలో చాలా మంది ప్రతిభావంతులు.. ప్రజాదరణ కన్నడ నటీమణులు ఉండగా.. వారిలో ఒకరిని నియమించుకోకుండా ముంబైలో పుట్టిన తమన్నాను ఎలా నియమిస్తారంటూ నిలదీస్తున్నారు. దీంతో కన్నడిగులు మనోభావాలు దెబ్బతిన్నాయని ధ్వజమెత్తెత్తున్నారు. కన్నడ నటులకే ఆ అవకాశం ఇవ్వాలని లేఖలో కన్నడ సంఘాలు డిమాండ్ చేశాయి.
మంత్రి క్లారిటీ
విపక్షాల విమర్శలపై కర్ణాటక భారీ మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. మార్కెటింగ్ నిపుణులతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మైసూర్ శాండల్ సబ్బును కర్ణాటకకు విస్తరించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ బ్రాండ్‌గా తీసుకెళ్లే ఉద్దేశంతోనే బాలీవుడ్ నటి తమన్నాతో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి వివరించారు. దీపికా పదుకొనే, రష్మిక మందన్న, పూజా హెగ్డే, కియారా అద్వానీ వంటి అనేక మంది ప్రముఖ సెలబ్రిటీలపై తర్జనభర్జనలు జరిగాయని.. చివరికి తమన్నా పాన్-ఇండియా సెలబ్రిటీ.. అలాగే ఆమె డిజిటల్‌లో 28 మిలియన్లకు పైగా అనుచరులు కలిగిన హీరోయిన్ కాబట్టే ఆమెను ఎంపిక చేసినట్లు వెల్లండిచారు. 2028 నాటికి రూ.5,000 కోట్ల ఆదాయమే లక్ష్యంతో ప్రభుత్వం తమన్నాతో ఒప్పందం చేసుకుందని మంత్రి క్లారిటీ ఇచ్చారు.