ఆలూరు కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణ హత్య కేసు తీవ్ర కలకలం రేపింది.. అయితే, ఈ కేసులో కొత్త మలుపు తిరుగుతుంది. ఈ కేసులో మాజీ మంత్రి, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కజిన్ గుమ్మనూరు నారాయణను అరెస్ట్ చేశారు పోలీసులు.. గుమ్మనూరు నారాయణ ఇంట్లో సీసీ టీవీ ఫుటేజీ స్వాధీనం చేసుకున్నారు.
Telangana Govt: తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది అని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 61.45 శాతం యాసంగి వడ్ల కొనుగోళ్లు పూర్తి అయినట్లు పేర్కొనింది. మే 12వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది అన్నారు.
Bhatti Vikramarka: భద్రాద్రి కొతగూడెం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గంలో గల బయ్యారం టేకులపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు స్వయం ఉపాధితో ఎదగడానికి రాజీవ్ యువ వికాసం వరం లాంటిది అన్నారు.
కేటీఆర్ కు నాయకత్వం అప్పగిస్తే సహకరిస్తాను అని తేల్చి చెప్పారు. నేను క్రమ శిక్షణ గల పార్టీ కార్యకర్తను.. గత 25 ఏళ్లుగా పార్టీలో నిబద్ధతో పని చేస్తున్నాను.. నా లీడర్ కేసీఆర్.. ఆయన చెప్పినట్లు నడుచుకుంటానని హరీశ్ రావు తెలిపారు.
కాంగ్రెస్ తెలంగాణలో అధికార పార్టీ. కానీ.. పవర్లో ఉన్న పార్టీకి ఉండాల్సిన లక్షణాలేవీ కనిపించడం లేదని సొంత నేతలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇంకా... నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే.. తల మాత్రమే ఉండి మొండెంలేనట్టుగా మారిపోయిందట తెలంగాణ కాంగ్రెస్.
Minister Ponnam: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముక్తకంఠంతో సైన్యానికి దేశం మొత్తం సంఘీభావం తెలిపిన కేంద్ర ప్రభుత్వం పోరాటం ఆపివేయడం తీవ్రంగా కలిచివేసింది అన్నారు. మన సైనికులు చేసిన పోరాటం ఎటువంటి కార్యరూపం దాల్చాక ముందే.. ఒక్క ట్విట్టర్ తో దేశ సార్వబౌమత్వాన్ని ప్రశ్నార్థకంగా మిగిల్చారు ప్రధాని మోడీ.
Congress: కర్ణాటక కాంగ్రెస్ ఎక్స్లో చేసిన ఓ పోస్టు తీవ్ర వివాదాస్పదంగా మారింది. జమ్మూ కాశ్మీర్కి పాకిస్తాన్ భూభాగంగా చూపిస్తున్న ఫోటోని షేర్ చేసింది. పాకిస్తాన్కి ఐఎంఎఫ్ రుణాన్ని ఆపడంలో ప్రధాని నరేంద్రమోడీ, ఆయన ప్రభుత్వం విఫలమైందని విమర్శించడానికి, కాంగ్రెస్ ఈ ఫోటోని షేర్ చేసింది.
EX MLA Jagga Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేసిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈటెల రాజేందర్ వి నాన్సెన్స్ కామెంట్స్.. రండ అంటే అర్థం ఏంటో చెప్పు ఈటల అని ప్రశ్నించారు.
Jagga Reddy: ప్రస్తుతం భారత్- పాకిస్తాన్ యుద్ధంపై చర్చ కంటే ఎక్కువ ఇందిరా గాంధీ ఉన్నప్పుడు జరిగిన యుద్ధం గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు.
జిన్నారంలో ఏం జరుగుతుందో విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను నాలుగుసార్లు ఎంపీగా అడిగినా సరైన సమాధానం లేదు అని పేర్కొన్నారు. దేశద్రోహులను వెంటనే పంపించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చినా.. ఇప్పటికి అధికార యంత్రాంగం స్పందించడం లేదు అని ఆరోపించారు. దేశద్రోహులకు, కాంగ్రెస్కు ఉన్న సంబంధం బయటపడింది అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.