Minister Ponnam: హైదరాబాద్ నగర అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన జీహెచ్ఎంసీ సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి పనులపై చర్చించాం అని తెలిపారు. ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించాను.
BRS Party: హైదరాబాద్ మెట్రో టికెట్ ధరల పెంపును తక్షణం వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి హైదరాబాద్ నగర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ రాశారు.
హరీష్ రావు పార్టీ పెడతారు అని ప్రచారం జరుగుతుంది.. అందుకే బుజ్జగించడానికి కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లాడని ఆరోపించారు. అయితే, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నలుగురే.. ఇప్పుడు నలుగురే అని పేర్కొన్నారు. హరీష్ ఇంటికి కేటీఆర్ వెళ్లి పార్టీలో ఉండాలని బ్రతిమిలాడుకుంటున్నాడని ఆది శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.
Mahesh Goud : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశంపై టీపీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిజామాబాద్లో మంత్రివర్గ విస్తరణపై స్పందించిన ఆయన, ఈ నెల చివరిలో లేదా జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ జరగవచ్చని అభిప్రాయపడ్డారు. వివిధ సమీకరణాల కారణంగా మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతున్నట్టు తెలిపారు. ఆసక్తి ఉన్నవారెంతైనా ఎక్కువగా ఉన్నప్పటికీ ఖాళీల సంఖ్య తక్కువగా ఉండటం వలన ఆలస్యం జరుగుతోందని అసహనం వ్యక్తం…
ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, ఈ అంశంపై భారత్ వైఖరిని వివరించడానికి కీలకమైన విదేశీ దేశాలను సందర్శించడానికి భారత ప్రభుత్వం ఏడుగురు సభ్యుల అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ కూడా ఉన్నారు. తిరువనంతపురం నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన శశి థరూర్ ఈ అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇతర నామినేటెడ్ సభ్యులలో బిజెపి నాయకులు…
తెలంగాణలో ముక్కోణపు రాజకీయం యమా హాట్ హాట్గా మారుతోంది. అదీకూడా.. ఏడాదిన్నర క్రితం వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేంద్రంగా జరుగుతుండటం ఉత్కంఠను పెంచుతోంది. మొన్నటిదాకా గులాబీ పార్టీని బీజేపీకి బీ టీమ్ అని కాంగ్రెస్ అంటే.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనంటూ కాషాయ దళం కౌంటర్స్ వేసింది.
అధిక తూకం లేకుండా, ధాన్యం తరలింపుకు రవాణా ఇబ్బందులు రాకుండా.. చర్యలు తీసుకోవడంతో పాటు పేమెంట్ ఆలస్యం కాకుండా వెంట వెంటనే రైతుల ఖాతాల్లో పడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Minister Seethakka: ఎన్టీవీతో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కమిషన్లతో నడిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీది అని ఆరోపించింది. కేటీఆర్ కు అధికారం పోయాక పిచ్చోడు అయిపోయాడు అంటూ మండిపడింది. చెల్లి రేపో మాపో రాజీనామా చేస్తదని తెలుస్తుంది అన్నారు.
Ponguleti Srinivasa Reddy: నిర్మల్ జిల్లాలోని కుంటాల సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భూములు ఉన్నవారికి రక్షణ కల్పించడమే భూ భారతి లక్ష్యం అన్నారు. నాలుగు పైలెట్ మండలాల్లో 13 వేల అప్లికేషన్లు వచ్చాయి.. సాధ్యమైనంత వరకు సమస్యలు అన్ని పరిష్కరిస్తాం.. ధరణి వల్ల ఇబ్బంది పడ్డారో అలాంటి సమస్య భూ భారతిలో ఉండదు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది అన్నారు. విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి.. రైల్వే లైన్లు, మెట్రో, ఇతర మాస్ ట్రాన్స్ పోర్టులకు విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి అన్నారు.