CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బసవేశ్వరుల స్ఫూర్తితో పాలన సాగిస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… బసవేశ్వరుడి చూపిన మార్గం తెలంగాణ ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. వారి సిద్ధాంతాలను అనుసరిస్తూ సామాజిక న్యాయమని, సమానత్వంపై దృష్టి సారిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు.
Akhanda 2 vs OG: గెట్ రెడీ.. అఖండ తాండవం కాదు, ఓజీ ఊచకోత?
అలాగే రాహుల్ గాంధీ చేసిన 150 రోజుల పాదయాత్రను గుర్తు చేస్తూ.. ఆ యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జనగణనతో పాటు కులగణన నిర్వహించాలని ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు. ఇది బసవేశ్వరుడి సిద్ధాంతాలనే ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. బసవేశ్వరుడి సందేశం అనుసరించి, ప్రతి వర్గానికి సముచిత భాగస్వామ్యం కల్పించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యానికి బసవేశ్వరుని సందేశం మానవతా విలువలపై ఆధారపడి ఉన్న సూచికగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖలు, ఎంపీ సురేష్ షెట్ల్ కార్ పాల్గొన్నారు.
Karnataka: గ్యాంగ్‌రేప్ నిందితులకు బెయిల్.. భారీ ఊరేగింపుతో సంబరాలు