వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్, దొంగ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ అని.. ఇది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. ఈ మాట్లాడుతున్న మాటలు ఇతర కులాల్ని కించపరిచేలా ఉన్నాయని అన్నారు. రెడ్డి సామాజిక వర్గానికే అధికారం ఇవ్వాలని.. రెడ్డి సామాజిక వర్గానికే నాయకత్వం కట్టబెట్టాలని వ్యాఖ్యానించారని..…
హైదరాబాద్ నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిత్ ను అరెస్ట్ చేయడం దారుణం అని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. ఆయనతో పాటు ఇంకా కొంతమంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో దేశంలోని ప్రముఖుల ఫోటోలు లేవని ఆయన అన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో కీలకంగా ఉండీ, స్వాతంత్ర్య సంగ్రామంలో దాదాపుగా దశాబ్ధకాలం జైలులో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ ఫోటో లేకుండా సాలార్ జంగ్ మ్యూజియంలో నిర్వహిస్తున్న…
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ప్రస్తుతం కొండా సురేఖ, మురళీ దంపతుల చుట్టూ తిరుగుతున్నాయి. 2018లో పరకాలలో సురేఖ ఓటమి తర్వాత పెద్దగా చర్చల్లోకి వచ్చింది లేదు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక ఆయనకు దగ్గరయ్యారు. మరోసారి జిల్లాలో చక్రం తిప్పుతారని భావించాయి పార్టీ శ్రేణులు. ఇంతలో హుజూరాబాద్ ఉపఎన్నిక పీసీసీ చీఫ్, కొండా ఫ్యామిలీ మధ్య దూరం పెంచింది. అప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వరంగల్ తూర్పు తమ సొంత నియోజకవర్గంగా…
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక రాజకీయ రగడగా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును ఈ పథకానికి సంబంధించి నియోజకవర్గంలో ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినప్పటికీ.. లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలదే కావడంతో.. ఆయన రోల్ కీలకంగా మారిపోయింది. దీనిని మంథనిలోని టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారట. కాంగ్రెస్ కార్యకర్తలకే ఎమ్మెల్యే దళితబంధు ఇప్పిస్తున్నారని ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్‌డివిజన్‌లో అధికారపార్టీ నేతలు రహస్య మీటింగ్ పెట్టుకున్నారట. ఈ పథకాన్ని ముందుగా టీఆర్ఎస్…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొలిటికల్ పార్టీలు స్పీడ్ పెంచాయి. రాహుల్‌గాంధీ సభ తర్వాత దూకుడుగా వెళ్తోంది కాంగ్రెస్. బీజేపీ కూడా పట్టు పెంచుకోవడానికి చూస్తోంది. ఇదే సమయంలో ఆధిపత్యాన్ని నిలుపుకొనే పనిలో గట్టిగానే పావులు కదుపుతోంది అధికార టీఆర్ఎస్. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం టీఆర్ఎస్ స్ట్రాంగ్‌గా ఉంది. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు.. పార్టీ నాయకులు నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉండాలని టీఆర్ఎస్ పెద్దల నుంచి సూచనలు వెళ్లాయి. దీంతో గత 20 రోజులుగా ప్రజాప్రతినిధులంతా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పనిలో…
ధాన్యం కొనలేని కేసీఆర్.. దిల్లీ వెళ్లి డ్రామాలాడటాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండి పడ్డారు. ఖమ్మంజిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామంలో నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి విక్రమార్క టిఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీ చేయకపోవడంతో రూ.లక్ష రుణం తీసుకున్న రైతులు.. ఇవాళ బ్యాంకులకు రెండున్నర రెట్లకుపైగా బకాయిపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్నివిధాలుగా సంక్షోభంలో ఉన్న రైతుల్లో మానసిక, మనోధైర్యాన్ని నింపేందుకే…
వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు దీనావస్థలో ఉన్నారని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రైతులకు మద్దతు ధర లభించడం లేదని, నాణ్యత ప్రమాణాలు కూడా పాటించడం లేదని ఆయన ఆరోపించారు. 33 శాతం ధాన్యంలో ఇబ్బంది ఉన్నా కొనాలన్న లక్ష్మయ్య.. వడ్లు పోయకున్న మిషన్ లో తేమ శాతం 1.5 చూపిస్తుందని మండిపడ్డారు. ఎండకు కాలే ఇసుకలో కూడా 18 శాతం తేమ చూపిస్తుందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఇలా మోసం…
రాహుల్ గాంధీ వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ రాష్ట్రంలోని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో ఊరురా కాంగ్రెస్ నాయకులు ప్రజలతో మమేకమవుతూ.. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌తో పాటు.. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ ఢిల్లీ బస్తీ దవాఖానలు బాగున్నాయి అన్నారని.. అంటే తెలంగాణలో ఆసుపత్రులు బాగోలేవనే కదా అంటూ చురకలు అంటించారు పీసీస వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి గీతారెడ్డి.…
కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తాకింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, ప్రముఖ లాయర్, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ రోజు సమాజ్ వాదీ పార్టీ( ఎస్పీ) తరుపున రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమక్షంలో నామినేషన్ సమర్పించారు. కబిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీకి మే 16నే రాజీనామా చేసినట్లు కపిల్ సిబల్ వెల్లడించారు. ఈ రోజు నామినేషన్ కు ముందు…
ఇటీవల రాహుల్ గాంధీ వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ రైతు రచ్చబండ పేరిట కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ పురపాలకలో కోమరబండలో కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. అయితే కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కోదాడ నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యే స్యాండ్, ల్యాండ్ మైన్ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్…