తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలపై కాంగ్రెస్ పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తోంది. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనతో పాటు ఇటీవల జరిగిన పలు అత్యాచార ఘటనలపై టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తోన్నాయి. ప్రభుత్వం వైఫల్యం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.
తాాజాగా కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాలో ఆయన మీడియాతో మాట్లాడారు. పబ్ కల్చర్ తో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని.. పబ్ కల్చర్ కోసమేనా తెలంగాణ సాధించుకుందని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ చెప్పిన అభివృద్ధి ఇదేనా.? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు లేకపోవడంతో పెట్టుబడులు రావడం లేదని ఆయన విమర్శించారు.
గంజాయి, బెల్టు షాపులు లేని గ్రామాలు లేవని.. ప్రతీ నెల జీతం రావాలంటే ప్రభుత్వ అధికారులు అక్రమం మద్యాన్ని చూడకుండా నల్ల అద్దాలు పెట్టుకుని కళ్లు మూసుకోవాల్సిందే అని విమర్శించారు. పెట్రోల్ ధరల పంపుతో అన్ని నిత్యావ్సరాల వస్తువుల ధరలు పెరిగిపోయాయని జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు రూ. 32 అబ్కారీ ఆదాయం ఉంటే ప్రస్తుతం రూ. 80 వేల కోట్లకు ఆదాయం పెరిగిందని అన్నారు. 90 శాతం ప్రమాదాలు మద్యం మత్తులోనే జరిగాయని ఆయన అన్నారు. మద్యం అమ్మకాలకు తోడు డ్రంక్ అండ్ డ్రైవ్ తో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని తెలిపారు. అక్రమ మద్యాన్ని కొనసాగిస్తూ..అధికారులు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని.. విచ్చలవిడి మద్యంతో కనీస విలువలు లేకుండా పోయాయని ఆయన అన్నారు.