జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన లో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. బాలికపై అత్యాచారం ఘటనలో ఇప్పటి వరకూ ఐదుగురుని అదుపులో తీసుకున్నారు. అయితే ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డా దాసోజు శ్రవణ్ స్పందించారు. నిందితులను అరెస్ట్ చేయడానికి బదులుగా, కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం వెనుక కుట్ర దాగి ఉందని.. డ్రగ్, పబ్ కల్చర్ కి పరాకాష్టగా మారిన హైదరాబాద్ లో తాజాగా ఒక పబ్ నుండి టీఆర్ఆర్, ఎంఐఎం పార్టీ…
తెలంగాణలో ఇప్పుడు భాగ్యలక్ష్మీ ఆలయం, చార్మినార్ వివాదాలు నడుస్తున్నాయి. స్థానిక కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ చార్మినార్ వద్ద నమాజ్ చేయడానికి సంతకాల సేకరణ ప్రారంభించడంతో వివాదం రాజుకుంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా ఈ అంశంపై మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత రామచంద్రరావు ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు రామచంద్ర రావు. కాంగ్రెస్ పార్టీ హిందూ, ముస్లింలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని…
ఇవాళ హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని కాంగ్రెస్ నేతలు వీహెచ్, భట్టి విక్రమార్క, సీతక్క తదితరులు చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని సందర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు కరోనా నుంచి సోనియా గాంధీ కోలుకోవాలని పూజలు చేశారు. భాగ్యలక్ష్మీ అమ్మవారు హిందువులందరికీ దేవత అన్న కాంగ్రస్ నేతలు.. బీజేపీ నేతల తీరును తప్పుబట్టారు. బండి సంజయ్ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ చార్మినార్లో గల భాగ్యలక్ష్మి అమ్మ వారి…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2023లో ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కీసర వేదికగా చింతన్ శిబిర్ కార్యక్రామాన్ని నిర్వహించింది. దీంతో పాటు తెలంగాణలోని సమస్యలు, అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలి, ప్రజల్లో ఎలా ఎండగట్టాలనే విషయాలపై చర్చ జరిగింది. దీంతో పాటు సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ, సంస్థాగత, రైతులు, యువత ఇలా ఆరు కమిటీలను ఏర్పాటు చేసుకుని తెలంగాణ సమస్యలపై చర్చించారు. బుధవారం, గురువారం రెండు రోజులు చింతన్ శిబిర్ సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ సమావేశాల్లో…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు మేకపాటి విక్రమ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డిని ఎంపిక చేశారు సీఎం జగన్. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు…
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగంగా ఉన్నపుడు సమైక్య పాలకులు వివక్ష చూపితే, స్వరాష్ట్రంలో కేంద్రప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు సీఎం కేసీఆర్. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాల్సింది పోయి, నిరుత్సాహం కలిగించేలా కేంద్రం వ్యవహరించడం విచారకరం. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ళ నుంచే ఈ వివక్ష ప్రారంభమైంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైనా జరుపుకోక ముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ కు కట్టబెట్టింది. దీనివల్ల లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును మనం కోల్పోయాం. దీంతో కేంద్రం…
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా కష్టమే అని అన్నారు. 2024లో ఇప్పడు ఉన్న సీట్లు కూడా తగ్గుతాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం 30-35 సీట్లు మాత్రమే వస్తాయని అన్నారు. ఇదిలా ఉంటే మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) హస్తం ఉందని అన్నారు. తాజాగా అస్సాం బటద్రవాలో పోలీస్ స్టేషన్…
గ్రామాల్లో సర్పంచులు ఆందోళన చేస్తున్నారా..? లేక ఎవరైనా చెప్పి చేయిస్తున్నారా..? తెలియడం లేదని..కొన్ని మీడియా ఛానెళ్లు, వార్తా పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, నిన్నటి వరకు అందరి బిల్లులను క్లియర్ చేశామని వెల్లడించారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పల్లె ప్రగతి ఈ నెల 3 నుంచి 17 వరకు అన్ని గ్రామాల్లో జరుగుతుందని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, మంత్రులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఉపాధి హామీ పనులు మన రాష్ట్రంలో…
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేయడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. బీజేపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈడీ కేసులతో వేధిస్తోందని అంటున్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేఖంగా పెట్టిన నేషనల్ హెరాల్డ్ పేపర్ పై బీజేపీ కేసులు పెడుతోందని విమర్శిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీఎల్పీ లీడర్ మల్లు బట్టి విక్రమార్క ఈ అంశంపై ఫైర్ అయ్యారు. కీసరలో జరుగుతున్న కాంగ్రెస్ చింతన్ శిబిర్…