టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య ప్రస్తుతం మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ గా ఉన్న భాగ్యలక్ష్మీ కూడా టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రియాంక గాంధీ సమక్షంలో వీరిద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్లాల ఓదెలును కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రేమ్ సాగర్…
కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ నిన్న రాజీనామా చేసిన హార్దిక్ పటేల్.. ఇవాళ ఆ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.. రాజీనామా చేసిన మరుసటి రోజే కాంగ్రెస్ ‘అత్యంత కులతత్వ పార్టీ’ అంటూ మండిపడ్డారు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘అతిపెద్ద కులతత్వ పార్టీ’ కాంగ్రెస్ అని పేర్కొన్నారు.. రాష్ట్ర పార్టీలో తనకు ఎటువంటి విధులు కేటాయించలేదని ఆరోపించారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు కాగితాలపైనే ఉన్నాయని.. రెండేళ్లుగా నాకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదని మండిపడ్డారు. మరోవైపు.. కాంగ్రెస్కు…
బండారు లక్ష్మారెడ్డి. ప్రస్తుతం ఉప్పల్ trs నాయకుడు. మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి సోదరుడు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు లక్ష్మారెడ్డి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు మంత్రి హరీష్రావుకు కూడా సన్నిహితoగా ఉంటున్నారాయన. నాడు ఉప్పల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపునకు సపోర్ట్ చేయాలని పార్టీ ఆదేశించడంతో లక్ష్మారెడ్డి సహకరించారు. GHMC ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో…
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇటీవల వరుసగా జాతీయ నాయకులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తన పట్టును మరింత బిగించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. ఆ పార్టీలోని విభేదాలు బయట పడుతున్నాయి. వర్గ పోరు, అధిపత్య పోరుతో టీఆర్ఎస్లో లుకలుకలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా.. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని గులాబీ నేతల మధ్య అధిపత్య పోరుతో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్లోకి వెళ్లనున్నట్లు…
భారతదేశ ఆర్థిక పరిస్థితి కూడా శ్రీలంక లాగే ఉందని విమర్శించారు కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ. దేశంలో పెట్రోల్ రేట్లు, నిరుద్యోగిత, మతహింసలపై ట్వీట్ చేశారు. శ్రీలంక, ఇండియా ఆర్థిక పరిస్థితికి సంబంధించి గ్రాఫ్ లతో సహా ట్విట్టర్ లో పెట్టారు. 2011 నుంచి 2017 వరకు శ్రీలంక, భారత్ దేశాల్లో పెట్రోల్ రేట్లు, నిరుద్యోగం, మతహింస ఎలా ఉందనే దానిపై ట్వీట్ చేశారు. భారత దేశ ఆర్థిక పరిస్థితి కూడా శ్రీలంక లాగే…
ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటు సమయంలో సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేఖించారు. కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయాన్ని పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరం నుంచి పెద్దగా రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు కిరణ్ కుమార్ రెడ్డి. తాజాగా కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. త్వరలోనే ఆయన్ను ఏపీ పీసీసీ చీఫ్ గా…
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురించి పరిచయం అక్కర లేదు. తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. సోనియాగాంధీ కుటుంబానికి వీరవిధేయుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై విమర్శలు గుప్పిస్తూనే.. మరోవైపు ప్రభుత్వం చేసే మంచి పనులను పొగుడుతూ ఉంటారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాలను బహిరంగంగానే పొగిడారు. ఇదిలా ఉంటే మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు.…
12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలో వస్తుంది, రైతు డిక్లరేషన్ అమలు చేస్తాం.. ఆ బాధ్యత నాది అన్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వం అసైన్డ్ భూములు రైతుల నుండి లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల తరఫున కొట్లాడిన వారిపై కేసులు ఎత్తేస్తాం అన్నారు. రాజీవ్ గాంధీని చంపిన వారిని వదిలేయండి అని…
తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మగా వచ్చిన డబ్బును తెలంగాణ రాష్ట్రం కోసం వినియోగిస్తారా? ఇది అడిగే దమ్ము రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందా? అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. చత్తీస్గఢ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లకు పిలుస్తోందని మండి పడ్డారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నారు, వాటి ద్వారా వచ్చే డబ్బుతో అసలు ఏం చేయబోతున్నారు అని చెప్పే చిత్తశుద్ది బిజెపి…