నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని అర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదర్మట్ బ్యారేజ్‌పై తెలంగాణ ప్రభుత్వం పట్టింపేదని ఆయన ప్రశ్నించారు. రజాకార్ల హయాంలో వచ్చిన సాగునీరు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేక పోతుందని, ఖానాపూర్, కడెం రైతుల వర ప్రదాయిని సదర్మట్ అయకట్ట మనుగడ కోల్పోతోందని ఆయన వ్యాఖ్యానించారు. సత్వరమే కెనాల్ గండ్లు పూడ్చి రైతులను…
లోక్ సభలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ (శుక్రవారం) కాసేపు సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. లోక్‌సభ లో కాంగ్రెస్ పార్టీ పక్షనేత అధిర్ రంజన్ పై సస్పెన్షన్ వేయడంపై విపక్షాలు సభలో ఇవాళ నిరసన బాట పట్టాయి.
మోడీ సర్కారుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ స్పందించడంతో ప్రతిపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. వాకౌట్‌పై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ప్రశ్నలు లేవనెత్తే వారికి సమాధానాలు వినే ధైర్యం లేదంటూ ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ గురువారం కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. భారతదేశాన్ని అవమానించడంలో ఆ పార్టీ ఆనందం పొందుతుందని అన్నారు. ఆ పార్టీ ఏ చిన్న సమస్యనైనా తీసుకుంటుందని, భారతదేశాన్ని పరువు తీయడానికి విలేకరుల సమావేశాలు నిర్వహిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ప్రధాని మోదీ.. ఆ పార్టీపై భారత ప్రజలకు విశ్వాసం లేదని అన్నారు.
అవిశ్వాసం పెట్టిన విపక్షాలకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో ప్రధాని మోడీ ప్రసంగించారు. దేవుడే అవిశ్వాసం పెట్టాలని విపక్షాలకు చెప్పారని ఆయన అన్నారు. మూడు రోజులుగా చాలామంది మాట్లాడారని.. 2018లో కూడా అవిశ్వాసం పెట్టారు.
Women and Child Welfare Center Allegations Are Not True Said Mancherial BRS Leaders: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. అధికార నేతలు, ప్రతిపక్ష నేతలు సై అంటే సై అంటున్నారు. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ క్రమంలో మంచిర్యాల నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ నేతలపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకులు లేని విమర్శలు చేస్తున్నారు. మాతా, శిశు సంరక్షణ కేంద్రంపై లేని ఆరోపణలు చేసి…
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో హస్తం పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. రహమత్ నగర్ లో అజారుద్దీన్ వర్గం సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి చెందిన వర్గం ఎంట్రీ ఇచ్చారు. విష్ణుకు చెందిన నియోజకవర్గంలో కనీసం ఆయనకు సమాచారం ఇవ్వకుండా మీటింగ్ ఎలా పెడతారంటూ నిలదీశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని తెలిపారు.