కాంగ్రెస్ అధిష్ఠానంపై మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతుంది. నాగర్ కర్నూల్ టికెట్ విషయంలో ఆయన మౌన పోరాటం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై నాగం జనార్దన్ రెడ్డి స్పందించారు. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని ఆయన క్లారిటి ఇచ్చారు. పార్టీలో ఉండి ఉద్యమం చేయకూడదా? అని నాగం అడిగారు. కొల్లాపూర్ లో జగదీశ్వర్ రావు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు పార్టీలో చేరిన జూపల్లి కృష్ణారావుకు కొల్లాపూర్, నాగర్ కర్నూల్, గద్వాల సీట్లు కావాలట.. ఆయన వస్తే ఎదో జరిగిపోతుంది అంటా అంటూ నాగం జనార్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Sreemukhi: మొన్న అలా, ఇప్పుడు ఇలా.. చూపిస్తూ కవ్విస్తే తట్టుకోవడం ఎలా శ్రీముఖీ?
జూపల్లి కృష్ణారావు అంత పెద్దోడు ఎప్పుడు అయ్యాడో నాకు అర్థం కాలేదు అని మాజీ మంత్రి నాగం జనార్థర్ రెడ్డి అన్నారు. ఇక్కడ గెలిచినోడు ఇక్కడే ఉంటాడు అని గ్యారంటీ ఎవరు ఇస్తారు.. నాగర్ కర్నూల్ నుంచి పోటీ ఎవరు చేస్తారన్న విషయం పార్టీ నిర్ణయిస్తుందని నాగం చెప్పారు. తాను నాగర్ కర్నూల్ లో పార్టీని కాపాడుకున్నాను.. 5 సంవత్సరాల్లో జరిగిన అన్ని ఎన్నికల్లో తానే ఖర్చులు పెట్టుకుని పనిచేశానని ఆయన తెలిపారు. పార్లమెంట్ నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వరకు అన్నింటినీ దగ్గరుండి చూసుకున్నట్లు నాగం పేర్కొన్నాడు.
Read Also: Group 1 Mains Result Release: గ్రూప్ 1 ఫలితాలు విడుదల..
నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లోనే సీనియర్ ని అంటూ నాగం జనార్థర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన విమర్శలు గుప్పించారు. కాగ్ రిపోర్ట్ ను అసెంబ్లీలో పెట్టాల్సింది పక్కన పెట్టారు.. అవినీతిలో దేశంలోనే పెద్ద పార్టీ బీఆర్ఎస్.. కాళేశ్వరంలో పెద్ద దోపిడీ జరిగింది.. కేసీఆర్.. ఎవడబ్బ సొత్తు అని లూటీ చేశారు. రూ. 5,525 కోట్లు లూటీ చేసినట్టు కాగ్ చెప్పింది అని నాగం జనార్థన్ రెడ్డి పేర్కొన్నాడు. అందరి అవినీతి గురించి చెప్పే కాగ్ రిపోర్ట్ కంటే ఇంకా ఆధారాలు ఏం కావాలి అని ఆయన అన్నారు.
Read Also: Shimla Rains: షిమ్లాలో వర్ష బీభత్సం.. గాల్లో రైల్వే ట్రాక్
కాంగ్రెస్ ఎంపీలు.. తాడో పేడో తేల్చుకొండి అంటూ నాగం జనార్థర్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో 30 శాతం అవినీతి ఉంటే.. తెలంగాణలో 70 శాతం అవినీతి ఉంది అని ఆయన విమర్శించారు. కాగ్ రిపోర్ట్ ను ఏసీబీకి పంపుతా.. ఏసీబీ యాక్షన్ లేకుంటే.. ఏసీబీ కోర్టుకు వెళ్తా.. నేను చెప్పింది ఎవరు నమ్మలేదు.. ఇప్పుడు కాగ్ చెప్పింది అయినా నమ్ముతారా.. కేసీఆర్ ఈ సమాజానికి చీడ పురుగు లెక్క తయ్యార్ అయ్యాడు అని ఆయన విమర్శలు గుప్పించాడు.