Rahul Gandhi Fire On EC: దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఇవాళ జరుగుతున్న కాంగ్రెస్ న్యాయ సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేను రాజును కాదు, రాజా కావాలని కోరుకోను.. రాజు కాన్సెప్ట్ కు నేను వ్యతిరేకం అన్నారు.
దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, 15 సీట్లతో మోడీ ప్రధాని అయ్యారు.. ఆ 15 సీట్లు లేకుంటే ప్రధాని పదవి మోడీకి దక్కేది కాదన్నారు. రాబోయే రోజుల్లో ఇవన్నీ బయట పెడుతాం..మా దగ్గర 100 శాతం ఆధారాలున్నాయి.. రఫేల్ డీల్ లో పీఎంవోతో పాటు NSA జోక్యం చేసుకున్నాయి.. దీనికి సంబంధించి మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని రాహుల్ గాంధీ తెలియజేశారు.
KTR: హస్తిన యాత్రలో రేవంత్ రెడ్డి అర్ధశతకం సాధించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. ఈ పోస్టులో.. తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా.. ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్నారని ఆరోపించారు.
Congress Legal Summit: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో న్యాయ సదస్సు జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలు అనే థీమ్ పై సదస్సు జరగబోతుంది.
డిల్లీ – దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో న్యాయ సదస్సు జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలు అనే అంశంపై సదస్సును నిర్వహిస్తున్నారు.. విజ్ఞాన భవన్లో జరిగే సదస్సులో దేశంలోని పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.. కాంగ్రెస్ న్యాయ సదస్సును మొత్తం ఐదు సెషన్లుగా విభజించారు 1. సామాజిక న్యాయం & రాజ్యాంగం: సమానత్వం, సౌభ్రాతృత్వ భావనలు 2. మతం & రాజ్యాంగం: నియంత్రణలు, మార్గదర్శకాలు 3. అధికార విభజన,…
Meenakshi Natarajan : ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వ్యాపార వర్గాలకే సేవలు చేస్తోందని కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ మండిపడ్డారు. ఆదివారం సంగారెడ్డిలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, “మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీల కోసమే పని చేస్తోంది” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో ప్రస్తుతం రెండు రకాల పాలన మోడల్స్ ఉన్నాయని పేర్కొన్నారు. ఒకటి తెలంగాణ మోడల్ కాగా, రెండవది విద్వేష పూరిత పాలన మోడల్. తెలంగాణలో అమలవుతున్న…
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ లిస్ట్‌పై తీవ్ర రగడ నడుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న బీఆర్ఎస్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అన్నట్లుగా ఉండకూడదని పేర్కొంది. ఈ అంశంపై మూడు నెలల్లో తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఇప్పుడు.... కాస్త రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కర్నీ విపరీతంగా ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే...త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాగా... అధికార పార్టీగా... ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తమ చేయి దాటి పోనివ్వకూడదన్న పట్టుదలగా ఉంది కాంగ్రెస్. అటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో... ఈ ఎన్నికల యుద్ధంపై ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది.