హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. శనివారం ఇంఛార్జ్ మంత్రులు సమావేశం అయ్యారు. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, జూబ్లీహిల్స్ ఇంఛార్జ్ చైర్మన్లు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించే వ్యూహంపై చర్చించారు. ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉంది. అలాగే బీఆర్ఎస్ కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని సూచిస్తోంది. తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కారు పార్టీ భావిస్తోంది.
ఇది కూడా చదవండి: AA22×A6 : అల్లు అర్జున్ – అట్లీ కాంబో హాలీవుడ్ టచ్‌తో భారీ ప్లాన్!
ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిచెందారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆయన మరణంతో జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఎన్నికపై ఇప్పటికే ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ ఎన్నిక నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. అక్టోబర్ లేదా నవంబర్‌లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ సమయంలోనే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది.
ఇది కూడా చదవండి: Warangal: వరంగల్‌లో ఎస్సై వీరంగం.. రెస్టారెంట్‌లో మహిళపై దాడి