TG Speaker Notices to MLAs: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సిద్ధమైట్లు తెలుస్తుంది. సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయ సలహా తీసుకున్న స్పీకర్.. 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. జూలై 25వ తేదీన విచారణ చేసిన న్యాయస్థానం మూడు నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది.
Read Also: Kerala: మలయాళ నటికి యువ నాయకుడు లైంగిక వేధింపులు.. సోషల్ మీడియాలో బాధితురాలు ఆవేదన
ఇక, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం మరోసారి చర్చనీయాంశం అయింది. తాజాగా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇస్తారని అంశంపై చర్చ కొసాగుతుండగా.. ఈ అంశంపై ఎన్టీవీతో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ మాట్లాడుతూ.. తనకు ఎటువంటి నోటీసులు రాలేదన్నారు. భద్రాచలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగానే ఉన్నాను.. అటువంటి పరిస్థితి వస్తుందని అనుకోవటం లేదని పేర్కొన్నారు. భద్రాచలం నియోజకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎంతో అభివృద్ధి చేస్తున్నాను అని ఎమ్మెల్యే వెంకట్రావ్ పేర్కొన్నారు.