Telangana Govt: దేశరాజధానిలో బీసి రిజర్వేషన్ల అంశం హీటెక్కుతోంది. ఏకంగా బీసీల రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ధర్నాకు దిగుతోంది. జంతర్ మంతర్ లో జరిగే ధర్నాను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీడ్ చేయనున్నారు.
Rahul Gandhi: భారత్ జోడో యాత్ర సమయంలో ఇండియన్ ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు నిన్న (ఆగస్టు 4న) మందలించింది. రాహుల్పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు నిరాధారణమైనవని, అతడు మాట్లాడిన మాటలు సరైనవేనంటూ ఇండియా కూటమిలోని పలు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.
సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నర్సారెడ్డి తనను కులం పేరుతో దూషిస్తూ, చంపేస్తామని బెదిరించాడంటూ గజ్వేల్ పీఎస్లో కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేత విజయ్కుమార్ ఫిర్యాదు చేశారు.
Revanth Reddy–Komatireddy Phone Call Goes Viral: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. మినిస్టర్ క్యాంప్ ఆఫీస్కు ఇందిరా భవన్గా నామకరణం చేశారు. ఆపై యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సదుపాయాలను,…
ఏపీలో పీసీసీ చీఫ్ మార్పుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణి కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ మార్పుపై అపోహలు వద్దన్నారు. షర్మిల గురించి అధిష్టానానికి ఎటువంటి ఫిర్యాదు చేయలేదున్నారు. అయినా షర్మిల వర్కింగ్ స్టైల్ ఆమెదని చెప్పుకొచ్చారు.
Minister Komatireddy comments on MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎవరో తనకు తెలియదు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత బీసీ ధర్నా జోక్ అని ఎద్దేవా చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంతో కోట్లాడుతాం అని తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మెల్సీ కవిత ధర్నాచౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. బీసీలకు…
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తప్పుపట్టారు. సోషల్ మీడియాపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సామజిక బాధ్యతతో పనిచేసే వారిని గౌరవించాలని పేర్కొన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులను అనవానించడం సబబు కాదని సూచించారు. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదని హెచ్చరించారు. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే…
DK Shivakumar: కర్ణాటక పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, సీఎం సిద్ధరామయ్యతో ఉన్న విభేదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి ఆశిస్తున్న డీకే, ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రంలో ప్రసంగిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో "రాజ్యాంగ సవాళ్లు" అనే శీర్షికతో AICC నిర్వహించిన కార్యక్రమంలో, గాంధీ కుటుంబాన్ని ప్రశంసించారు.
బీసీ రిజర్వేషన్ల వ్యవహారం రాజకీయ పార్టీల మధ్య హీట్ పెంచుతోంది. అధికార ప్రతిపక్ష లీడర్లు విమర్శలు, ప్రతి విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీవీ తో రాష్ట్ర మంత్రి సీతక్క మాట్లాడారు. ఓట్ల కోసం బీజేపీ మత రాజకీయాలు చేస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం ఆ పార్టీకి ఇష్టం లేక, కాంగ్రెస్ పై విమర్శలు చేస్తుంది. బీజేపీ నిజ స్వరూపాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. అధికారం కోసమే కవిత దీక్ష డ్రామా మొదలుపెట్టిందని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు…