జార్ఖండ్లో బుధవారం తొలి విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బంది.. ఈవీఎంలు తీసుకుని పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. మరోవైపు ఎన్నికల అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు.
రైతుకు ఎక్కడ కష్టం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జాతీయ రహదారిపై మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడారు.
నెలకొక సారి అయినా ఉన్నత ఉద్యోగంలో ఉన్నవాళ్లు స్వంత ఊర్లకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వెనుకబడ్డ వారి సమస్యలు అడిగి తెలుసుకోండని.. స్ఫూర్తి కలిగించండన్నారు. "లీడర్ అంటే లీడ్ చేసే వాడు. కానీ గృహ ప్రవేశాలు అంటూ దావత్ లు చేసుకుంటున్నామని బయటకు చెప్తున్నారు. దీపావళికి అందరూ చుచ్చుబుడ్డిలు వెలిగిస్తే.. కొంతమంది సారా బుడ్డిలు ఓపెన్ చేస్తూ... ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు డ్రగ్స్ తీసుకునే నిబంధనలు అతిక్రమిస్తుంటే... వాళ్ళనీ ప్రోత్సహిస్తున్నారు..
రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో మైనారిటీలు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హిందూ, ముస్లింలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటి వారన్నారు. రవీంద్రభారతిలో జాతీయ విద్యా దినోత్సవ& మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకలకు హాజరైన సీఎం ప్రసంగించారు. "మీరంతా అండగా ఉంటే విద్య, వైద్యం, ఉపాధి విషయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకుందాం. దేశంలో ఉన్నవి రెండే పరివార్లు.
కుల గణనకు తాను వ్యతిరేకం కాదని.. కానీ సూచన చేయాలనుకున్నట్లు మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు తెలిపారు. కింది స్థాయి కులాలు అనుకునే వాళ్ళు.. పెద్ద స్థాయి కులాల వాళ్ళ ఇంటి పక్కనే భూములు కొని ఇండ్లు కట్టుకుంటున్నారన్నారు. అలాంటి పరిస్థితిలో.. కుల గణనతో ఇబ్బంది వస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. గజిబిజి లేకుండా సాఫీగా జరగాలని సూచించారు.
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయానికి కుల గణన సర్వే చేయటానికి అధికారులు వచ్చారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
DK Aruna : బీజేపీ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదని మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ, మూసీ ప్రక్షాళనపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ నీటిని శుద్ధి చేసి మంచి నీటిగా మార్చాలని తమకు వ్యతిరేకం లేదు అని ఆమె స్పష్టం చేశారు. అయితే, మూసీ ప్రక్షాళన పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రణాళికను మాత్రమే బీజేపీ వ్యతిరేకిస్తోందని ఆమె…
జగిత్యాల జిల్లా నుంచి మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా గత ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యారంగం పట్ల సరైన దృష్టి ఇవ్వలేదని, విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని ఆమె పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు, విద్యా రంగాన్ని పునరుద్ధరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.
Kiren Rijiju: రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కేంద్రమంత్రి, బీజేపీ నేత కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు పూణేలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి పరిపక్వత లేదని, విదేశాల్లో భారత్ని నిందించడం కారణంగా ఎవరూ నాయకులు కాలేరని హితవు పలికారు.